Tirumala Brahmotsavalu: వేడుకగా చినశేష వాహన సేవ.. తిరమాడ వీధుల్లో భక్తులకు అభయ ప్రదానం..

అశేష భక్త జన సందోహం మధ్య.. జయజయధ్వాన నినాదాలతో కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్న శేష వాహన..

Tirumala Brahmotsavalu: వేడుకగా చినశేష వాహన సేవ.. తిరమాడ వీధుల్లో భక్తులకు అభయ ప్రదానం..
Chinnasesha Vahana Seva
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 28, 2022 | 12:21 PM

అశేష భక్త జన సందోహం మధ్య.. జయజయధ్వాన నినాదాలతో కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్న శేష వాహన సేవను నిర్వహించారు. ఈ సేవలో శ్రీ మలయప్ప స్వామి చిన శేషవాహనం పై నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తమ ఇష్ట దైవాన్ని మనసారా దర్శించుకున్నారు. కాగా.. బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం జగన్‌కు మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్‌కే రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

అలిపిరిలో ఎలక్ట్రిక్‌ బస్సులను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. అక్కడి నుంచి తిరుమలకు చేరిన తిరుమల చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా అర్చకులు పట్టు వస్త్రంతో సీఎం జగన్‌ తలకు పరికట్టం కట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి 8.55 గంటలకు మాడవీధుల్లో శ్రీవారి పెద్ద శేష వాహన సేవ ప్రారంభమైంది. ఈ సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఉదయం ప్రాతః కాల సమయంలో శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం నూతనంగా నిర్మితమైన పరకామణి భవనాన్ని, లక్ష్మి వీపీఆర్ రెస్ట్ హౌస్ ను ప్రారంభించారు.

Cm Jagan In Tirumala

Cm Jagan In Tirumala

Cm Jagan At Tirumala

Cm Jagan At Tirumala

మంగళవారం రాత్రికి తిరుమలలోనే బస చేసిన సీఎం జగన్.. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు.. ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5.15 నుండి 6.15 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం పెదశేష వాహన సేవ, బుధవారం ఉదయం చిన్నశేష వాహన సేవను నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..