- Telugu News Photo Gallery Spiritual photos CM YS Jagan participates in Tirumala Srivari Brahmotsavalu and did Dharshanam on his Tirumala Tour
Tirumala Brahmotsavalu 2022: శ్రీవారి సేవలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్..
అశేష భక్త జన సందోహం మధ్య.. జయజయధ్వాన నినాదాలతో కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
Updated on: Sep 29, 2022 | 12:35 PM

అశేష భక్త జన సందోహం మధ్య.. జయజయధ్వాన నినాదాలతో కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్న శేష వాహన సేవను నిర్వహించారు. ఈ సేవలో శ్రీ మలయప్ప స్వామి చిన శేషవాహనం పై నుంచి భక్తులకు దర్శనమిచ్చారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

సీఎం జగన్‌కు మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్‌కే రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

అలిపిరిలో ఎలక్ట్రిక్ బస్సులను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అక్కడి నుంచి తిరుమలకు చేరిన తిరుమల చేరుకున్నారు.

ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం జగన్.
