Telugu News Trending A video of a boy doing kung fu in front of a goat has gone viral on social media Telugu Viral News
Video Viral: నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.. మేక ముందు చిన్నారి కుంగ్ ఫూ.. వీడియో చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. వారు చేసే చిన్ని చిన్న పనులు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కలగిస్తాయి. ఇక ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వారి ఆగడాల గురించి చెప్పాల్సిన పనే..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. వారు చేసే చిన్ని చిన్న పనులు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కలగిస్తాయి. ఇక ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వారి ఆగడాల గురించి చెప్పాల్సిన పనే లేదు. పెట్స్ తో ఎంతో ఆనందంగా, సంబరంగా ఆడుకుంటూ మురిసిపోతుంటారు. అవి కూడా చిన్నారులతో కలిసి పోయి సరదాగా ఆడుకుంటుంటాయి. సాధారణంగా బాల్యంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి పనులు చేసే ఉంటారు. బాల్యం తిరిగి రానిది. ఆ జ్ఞాపకాలు జీవితాంతం మరవలేనివి. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది. చిన్న వయసులో మనం చేసిన పనులు, ఆడుకున్న ఆటలు వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారు. రోజంతా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కొన్ని సార్లు వస్తువులను బయట విసిరేస్తే.. మరికొన్ని సార్లు ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా చేస్తారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ పిల్లవాడు పెంపుడు జంతువుతో కుంగ్ ఫూ చేయడాన్ని చూడవచ్చు.
ఈ వీడియోలో ఓ చిన్నారి.. మేక ముందు కుంగ్-ఫూ చేస్తున్నాడు. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత మేకకు పట్టరాని కోపం వచ్చింది. అతడు చేసే పనికి చిర్రెత్తి తలతో పిల్లవాడిని కొడుతుంది. దీంతో అతను కింద పడిపోతాడు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఇది చూసిన తర్వాత మీరు కచ్చితంగా నవ్వకుండా ఉండలేరు. ఈ ఫన్నీ వీడియో @Shit_vidz అనే ఐడీతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 5 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 48 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. కామెంట్‌లో నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేస్తున్నారు.