AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగద్గురు ఆది శంకరాచార్య మఠం రథోత్సవాలకు ఆహ్వానం.. ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు వేడుకలు

సికింద్రాబాద్‌లో వెంకుసా ఎస్టేట్స్ కౌకూర్ గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠం.. ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు మొదటి రథోత్సవ ఉత్సవాలు, శంకర జయంతి వేడుకలు జరుపుతున్నారు. మొత్తం 3 రోజుల పాటు పాటు జరిగే ఈ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..

జగద్గురు ఆది శంకరాచార్య మఠం రథోత్సవాలకు ఆహ్వానం.. ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు వేడుకలు
Kalady Sri Adi Shankara Madom
Srilakshmi C
|

Updated on: Apr 17, 2025 | 11:12 AM

Share

సికింద్రాబాద్, ఏప్రిల్ 17: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త, జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల బోధనలు భావితరాలకు అందించేందుకు సికింద్రాబాద్‌లో వెంకుసా ఎస్టేట్స్ కౌకూర్ గ్రామం బొలారంలో కాలడి శ్రీ ఆదిశంకర మఠం కృషి చేస్తుంది. దీనిలో భాగంగా కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు జరిగే మొదటి రథోత్సవ ఉత్సవాలు జరుపుతున్నారు. మొత్తం 3 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి స్వామీ స్థితప్రగ్నానంద సరస్వతి, ఎంపీ ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్యే ఎమ్ రాజశేఖర్‌ రెడ్డి, లోక కేరళ సభ సభ్యులు కే సురేందర్, కల్చరల్‌ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, శ్రీమతి కృష్ణవేణి, నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కల్చరల్‌ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణకు శ్రేష్టాచార్య 2025 అవార్డు ప్రధానం చేయనున్నారు.

అలాగే శంకర జయంతి వేడుకలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు భక్తులను ఆహ్వానిస్తూ కాలడి శ్రీ ఆదిశంకర మఠం ప్రకటన జారీ చేసింది. మొత్తం 3 రోజుల పాటు పవిత్ర హోమాలు, పూజలు, అన్నదానం, రథోత్సవం కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. భక్తులకు ప్రత్యేక సేవలను బుక్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అలాగే శ్రీచక్ర పూజ & చండీ హోమం, గణపతి హోమం, గోదేవి పూజ, ఏకాదశ రుద్రాభిషేకం.. పూజలు, హోమాలకు స్పాన్సర్ కూడా చేయవచ్చు. పరిమిత టిక్కెట్లు అందుబాటులో ఉన్నందున్న భక్తులు స్లాట్‌ను రిజర్వ్ చేసుకోవడానికి ముందుగానే బుక్ చేసుకోవల్సి ఉంటుంది.

శ్రీ ఆదిశంకర మఠం ప్రత్యేక సేవ బుకింగ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

అలాగే ఈ ధర్మ యజ్ఞంలో భాగమయ్యేందుకు భక్తులు విరాళాలు కూడా అందించొచ్చు. ఈ మేరకు భక్తుల నుంచి విరాళాలు కోరుతూ ఆలయ యాజమన్యం విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నదానం (అందరికీ ఉచిత ఆహారం), ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు – సత్సంగాల.. కోసం భక్తుల భాగస్వామ్యం కోరుతూ శ్రీశ్రీ జగద్గురు ఆది శంకరాచార్య మహాసంస్థానం ఆహ్వానం పలుకుతోంది. ఇతర సమాచారం, సందేహాలకు 8350903080 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.

బొల్లారంలోని కాలడి శ్రీ ఆదిశంకర మఠం చేరుకోవడానికి గూగుల్‌ మ్యాప్‌ లొకేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.