Telangana High Court CJ: తెలంగాణ చీఫ్‌ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌.. ఢిల్లీకి ప్రస్తుత సీజే..

Telangana High Court CJ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్ భుయాన్ నియామకం అయ్యారు. తెలంగాణ హైకోర్టులోనే అత్యంత సీనియర్ జడ్జిగా ఉన్న ఉజ్జల్..

Telangana High Court CJ: తెలంగాణ చీఫ్‌ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌.. ఢిల్లీకి ప్రస్తుత సీజే..
Justice Ujjal Bhuyan
Follow us

|

Updated on: Jun 18, 2022 | 5:58 AM

Telangana High Court CJ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్ భుయాన్ నియామకం అయ్యారు. తెలంగాణ హైకోర్టులోనే అత్యంత సీనియర్ జడ్జిగా ఉన్న ఉజ్జల్.. ఇక్కడే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ.. ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్నారు. జస్టిస్ విపన్ సంఘి ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తుండగా.. పూర్తిస్థాయి సీజేగా సతీష్ చంద్రను బదిలీ చేసింది కొలీజియం. వీరితో పాటు మరికొందరు సీజేలను కూడా బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆధ్వర్యంలోని కొలీజియం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ వివరాల ప్రకారం.. ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ విపిన్‌ సంఘి ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు, బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్‌ అహ్మద్‌ ఎ సయీద్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టుకు, బాంబే హైకోర్టుకే చెందిన జస్టిస్‌ ఎస్‌ఎస్‌.షిందే రాజస్థాన్‌ హైకోర్టుకు, గుజరాత్‌ హైకోర్టుకు చెందిన రష్మిన్‌ ఎం ఛాయ గౌహటి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు.