Telangana: జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. వేతనం భారీగా పెంపు

జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల వేతనం పెంచుతూ.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నెల వేతనం రూ.15 వేల నుంచి....

Telangana: జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. వేతనం భారీగా పెంపు
Telangana Govt

జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల వేతనం పెంచుతూ.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నెల వేతనం రూ.15 వేల నుంచి రూ. 28,719కి పెంపు చేస్తున్నట్లు వెల్లడించింది. జులై 1వ తేదీ నుంచి పెరిగిన వేతనం అమల్లోకి వస్తుందని పేర్కొంది.  ప్రొబేషన్​ పీరియడ్​ నాలుగేళ్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ఎం రఘునందర్‌‌ రావు ఉత్తర్వులు జారీ చేశారు.  సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం పట్ల జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో ప్రాణాలు కోల్పోయిన పంచాయతీ కార్యదర్శులును ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను గవర్నమెంట్ 2019 ఏప్రిల్‌లో భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రొబేషన్ పీరియడ్‌ను రెండేళ్లుగా ఖరారు చేసి రూ.15 వేల వేతనాన్ని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రొబేషన్ టైమ్ పూర్తయి రెండు నెలలు గడించింది. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జేపీఎస్‌ల ప్రొబేషన్ టైమ్‌ను నాలుగేళ్లకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామాల డెవలప్ మెంట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు.

 

Also Read: జగిత్యాల జిల్లాలో భారీ పాముని మింగిన కొండ చిలువ.. షాకింగ్ విజువల్స్

భరతమాతకు జై కొట్టిన వార్నర్.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్..

Click on your DTH Provider to Add TV9 Telugu