Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ రేప్ కేస్.. మూడో రోజు నిందితులందరినీ కలిపి విచారించనున్న పోలీసులు..
Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో పోలీసులు విచారణ కొనసాగుతుంది. నిందితుడు సాదుద్దీన్, మైనర్లను కస్టడీలోకి తీసుకొని విచారించారు
Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో పోలీసులు విచారణ కొనసాగుతుంది. నిందితుడు సాదుద్దీన్, మైనర్లను కస్టడీలోకి తీసుకొని విచారించారు పోలీసులు. ఇవాళ జూబ్లీహిల్స్ పీఎస్ లో మైనర్లతో కలిపి సాదుద్దీన్ ను విచారించనున్నారు పోలీసులు.
జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో నిందితుడు A-1 సాదుద్దీన్ ను పోలీసులు రెండో రోజు కస్టడీకి తీసుకొని విచారించారు. పబ్‌లో ఏం జరిగిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మాయిని ట్రాప్ చేయడం ఆ తర్వాత రేప్ చేయడం పథకంలో భాగమేనా అన్న ప్రశ్నలు సంధించారు. ఇవాళ జూబ్లీహిల్స్ పీఎస్‌లో మూడో రోజు కూడా విచారించనున్నారు పోలీసులు. మైనర్లతో కలిపి, వేర్వేరుగా విచారిస్తామని పోలీసులు చెప్పారు. మరోవైపు జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో జువెనైల్ హోమ్‌లో మైనర్ల మొదటి రోజు విచారణ ముగిసింది. ముగ్గురు మైనర్లను వేర్వేరుగా విచారించారు పోలీసులు. కస్టడీలో ఉన్న కార్పొరేటర్ కొడుకును ప్రత్యేకంగా విచారించారు పోలీసులు. ముగ్గురి నుంచి సమాచారం సేకరించింది దర్యాప్తు టీమ్.
జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో మైనర్లను కూడా రేపటి నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారించనున్నారు. ఉదయం జూబ్లీహిల్స్ పీఎస్‌కు మైనర్ల తరలిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విచారిస్తారు. విచారణ అనంతరం మైనర్లను జువెనైల్ హోమ్‌కు తరలిస్తారు. జువెనైల్ హోమ్‌లో పరిస్థితుల దృష్ట్యా.. జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించి విచారిస్తున్నామని చెప్పారు పోలీసులు. మరోవైపు బాలికపై గ్యాంగ్‌రేప్ కేసు లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూబ్లీహిల్స్ పోలీసుల చేతికి బాలిక మెడికల్ రిపోర్ట్ చేరింది. బాలికపై నిందితులు విచక్షణారహితంగా దాడి చేసి.. ఒంటిపై 12 తీవ్ర గాయాలు చేసినట్లు మెడికల్ రిపోర్ట్ లో తేలింది. బాలిక నిరాకరించడంతో గోళ్లతో దాడి చేశారు. బాలిక ఒంటిపై 12 తీవ్రగాయాలున్నట్లు వైద్యుల నిర్ధారించారు. ఇక జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో వీడియోలు వైరల్ చేసిన మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. త్వరలో ఐపీఅడ్రస్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. బాలిక వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు పోలీసులు.