Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jubilee Hills bypoll: నేతలకు ఇజ్జత్ కా సవాల్‌గా జూబ్లీహిల్స్ బైఎలక్షన్

గతంలో చాలా ఉప ఎన్నికలు చూశాం. హుజూరాబాద్‌లో టఫ్ ఫైట్. సాగర్‌లో ఢీ అంటే ఢీ. దుబ్బాకలో హైటెన్షన్ ఎలక్షన్ వార్. ఇక మునుగోడు తాయిళాల గురించైతే స్టేట్స్ దాటి మాట్లాడుకున్నారు. బట్.. వీటన్నింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే.. చర్చంతా ఆ నియోజకవర్గం గురించి తప్ప టాపిక్ అంతకు మించి దాటి వెళ్లలేదు. 'ఇప్పటిదాకా ఏం చేశారు, గెలిస్తే ఏం చేస్తారు'. ఇదే చర్చ. బట్.. జూబ్లీహిల్స్ వీటన్నింటికీ భిన్నం. 'కేసీఆర్‌ను ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ అరెస్ట్ కాకుండా ఎందుకు కాపాడుతున్నారు'.. ఇవొస్తున్నాయి ప్రచార అంశంలోకి. 'అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ 420 హామీలిచ్చింది, వాటి సంగతేంటి' అని బాకీ కార్డ్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్‌లో చూపిస్తున్నారు. ఆఖరికి దేశభక్తిని కూడా పట్టుకొచ్చి ఈ ఉప ఎన్నికలో ఒక టాపిక్‌గా మార్చారు. ఒకవిధంగా.. ఎన్నికల అంశం కానిదేం లేదు. జూబ్లీహిల్స్‌లో ఇంత పొలిటికల్ హీట్ ఏంటసలు? గెలుపోటములు అంత ప్రతిష్టాత్మకమా? ఏయే అంశాలు ఈ ఎన్నికను ప్రభావితం చేయబోతున్నాయి?

Jubilee Hills bypoll: నేతలకు ఇజ్జత్ కా సవాల్‌గా  జూబ్లీహిల్స్ బైఎలక్షన్
Jubilee Hills By Election
Ram Naramaneni
|

Updated on: Nov 05, 2025 | 9:38 PM

Share

జూబ్లీహిల్స్ బైపోల్.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పోల్చుతూ జరుగుతున్న ఉప ఎన్నికనా? రేవంత్ రెడ్డి పనితీరుకు, కేసీఆర్ పాలనాతీరుకు మధ్య పోలికను చూపించే బైఎలక్షనా? నిజానికి, ఏ ఉప ఎన్నిక కూడా రాష్ట్ర పాలనా తీరుకు మిర్రర్ కాదు. గత పదేళ్లను, ఈ రెండేళ్లను పోల్చడమూ కుదరదు. బట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అలా పోల్చేదాకా తీసుకెళ్లారు. జూబ్లీహిల్స్‌తో అటాచ్‌మెంట్ లేని అంశాలను కూడా తీసుకొచ్చి ప్రచారానికి వాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకోవడమే కాదు.. మోస్ట్ ప్రెస్టేజియస్‌గా చూస్తున్నాయి పార్టీలు. కారణం.. ఈ నియోజకవర్గం హైదరాబాద్‌లో ఉండడం. అధికార కేంద్రానికి దగ్గరగా ఉండడం. జూబ్లీహిల్స్‌లో బస్తీల నుంచి మల్టీస్టెయిర్ బిల్డింగుల వరకు, సెలబ్రిటీల నుంచి స్లమ్ పీపుల్ వరకు.. అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ఇక్కడ వచ్చే రిజల్ట్.. స్టేట్ పల్స్‌ను రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంత ప్రతిష్టాత్మకం. పైగా పార్టీలు, పార్టీల్లోని కీలక నేతలకు ఈ ఉప ఎన్నిక చావో రేవో అన్నంత పరిస్థితి. కాంగ్రెస్ గెలిస్తే పనితీరు బాగుందని ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చినట్టు. బీఆర్ఎస్ గెలిస్తే గత పదేళ్ల పాలనతో పోల్చుకున్నట్టు. బీజేపీ గెలిస్తే.. ప్రత్యామ్నాయం కింద లెక్కగట్టినట్టు. అందుకే, పార్టీలకు ఇది ప్రేస్టేజియస్. అలాగే.. నేతలకు కూడా కీలకం ఈ ఉప ఎన్నిక. జనరల్‌గా ముఖ్యమంత్రులు ఒక బైఎలక్షన్‌లో ప్రచారం చేయడం అరుదు. అందునా, భారీ షెడ్యూల్ రూపొందించుకుని...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి