Telangana: వైద్యారోగ్య శాఖలో కొలువుల జాతర.. 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. మెడికల్ విభాగంలో విద్యను అభ్యసించి ఉద్యోగం కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు తీపికబురు చెప్పింది తెలంగాణ వైద్యారోగ్య శాఖ.

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. మెడికల్ విభాగంలో విద్యను అభ్యసించి ఉద్యోగం కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు తీపికబురు చెప్పింది తెలంగాణ వైద్యారోగ్య శాఖ. వైద్య శాఖలోని పలు విభాగాలు ఇప్పటికే ఉద్యోగ భర్తీ చేయగా మరోసారి ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ శాఖలో మరో 1520 పోస్టులను భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది . ఇప్పటికే 1800 లకు పైగా నర్సింగ్ సిబ్బంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. తాజాగా కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ విభాగంలో ఖాళీగా ఉన్న మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు స్ఫష్టం చేసింది.
మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు…ఎంహెచ్ఎస్ఆర్బీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 19 వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ పై ట్విట్టర్లో మంత్రి హరీష్ రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు .అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
