VRO Arrested: రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్వో రవీందర్.. అరెస్ట్
VRO Arrested: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం కుందనపల్లి వీఆర్వో జక్కు రవీందర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ భూ వివాదంలో లంచం ..

VRO Arrested: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం కుందనపల్లి వీఆర్వో జక్కు రవీందర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ భూ వివాదంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. హైదరాబాద్‌లోని అబ్సిగూడ కిన్నెర గ్రాండ్ హోటల్‌లో రెండు లక్షల రూపాయలు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. టేకుమట్ల మండలంలోని ద్వారకపేట గ్రామానికి చెందిన రైతు జైపాల్‌రెడ్డికి చెందిన భూ వివాదంలో ఉంది. అయితే పట్టాదారు పాసుబుక్ ఇచ్చేందుకు అతని నుంచి రెండు లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ విచారణలో తేలింది. సదరు వీఆర్వో డబ్బులు డిమాండ్ చేయడంతో జైపాల్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. డబ్బులు ఇస్తానని ఆ రైతు చెప్పగానే వీఆర్వో గురువారం కిన్నెర గ్రాండ్ హోటల్‌కు చేరుకున్నాడు. రవీందర్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే అతనిపై ఏసీబీ అధికారులు మరింత విచారణ చేపడుతున్నారు. ఇంకెన్ని అక్రమాలకు పాల్పడ్డాడోననే దానిపై ఆరా తీస్తున్నారు.
Also Read: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడమే చంద్రబాబు లక్ష్యం: సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం