AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆమెకు 45.. అతడికి 24.. గుట్టుగా ఆ యవ్వారం.. సీన్‌లోకి కూతురి ఎంట్రీతో

యూట్యూబ్‌లో చూసి మర్డర్ స్కెచ్ వేశారు. ఆ యువతిని క్షుద్ర పూజలకు బలిచ్చినట్లు అందరిని నమ్మించి హైడ్రామా క్రియేట్ చేశారు. యువతిని చంపి ఆ డెడ్‌బాడీ వద్ద క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్ళతో హైడ్రామా క్రియేట్ చేసిన ఆ మర్డర్ మిస్టరీ వీడింది.  డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు చాకచక్యంగా చేధించారు. 

Telangana: ఆమెకు 45.. అతడికి 24.. గుట్టుగా ఆ యవ్వారం.. సీన్‌లోకి కూతురి ఎంట్రీతో
Telugu News
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 04, 2025 | 11:50 AM

Share

తీగలాగితే దొంగ కదిలింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన డబుల్ మర్డర్ మిస్టరీ వీడింది. అచ్చం దృశ్యం కథను మరిపించేలా కన్నతల్లి మర్డర్ స్కెచ్ వేసినట్లుగా గుర్తించిన పోలీసులు ఆ కసాయి తల్లితో పాటు ఆమె ప్రియున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గత నెల 25వ తేదిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. యువతి మృతదేహం వద్ద నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు చూసి అంతా షాక్ అయ్యారు. అడవిలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు జరిపి యువతిని బలిచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల విచారణలో ఈ యువతి మర్డర్ వెనుక ఖతర్నాక్ క్రైమ్ స్టోరీ బయటపడింది. కన్నతల్లే హంతకురాలని తేలింది.

తన వయస్సులో సగం వయస్సులేని ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ కసాయితల్లి.. మొదట యువతి తండ్రి రాజ్ కుమార్‌ను హతమార్చింది. ఈ విషయం కూతురుకు తెలియడంతో అదే ప్రియుడితో కలిసి కన్న కూతుర్ని అతికిరాతకంగా హత్య చేసి.. ఆ హత్యను అంతా దృష్టి మరల్చే ప్రయత్నం చేసింది. క్షుద్రపూజల కలకలం రేపి అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ కాకిల నిఘానేత్రం పసిగట్టడంతో పాపం పండి ఆ కసాయితల్లితో పాటు ఆమె ప్రియుడు కటకటాల పాలయ్యారు.

మృతురాలు చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన వర్షిణిగా గుర్తించారు.. గత నెల 2వ తేదీన వర్షిణిని హత్యచేసిన తల్లి కవిత ఆమె ప్రియుడు రాజ్ కుమార్ పోలీసుల దృష్టి మరల్చడం కోసం యూట్యూబ్‌లో చూసి ఖతర్నాక్ స్కెచ్ వేశారు. మృతదేహాన్ని ఒక సంచిలో మూట కట్టి గ్రామ శివారులోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక చెట్లపొదల్లో వేశారు. ఆ తర్వాత సినిమా కథను తలపించేలా తన కూతురు కనిపించడం లేదని 6వ తేదీన చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసుల విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఆగస్టు 25వ తేదీన వర్షిణి డెడ్ బాడీని సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో రాజ్‌కూమార్ ఒక వాహనంలో తీసుకెళ్లి కాటారం సమీపంలోని అడవిలో వదిలేశాడు. యూట్యూబ్ ద్వారా అనేక క్షుద్రపూజల వీడియోలు చూసిన అతడు అందరి దృష్టి మరల్చడం కోసం అక్కడ క్షుద్ర ప్రజల సీన్ క్రియేట్ చేశాడు. అయితే వర్షణి హత్యకు అసలు కారణం ఈ హత్యకు రెండు నెలల ముందు జరిగిన ఆమె తండ్రి కుమారస్వామి మర్డర్. 24 ఏళ్ల వయసు కలిగిన రాజ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత.. జూన్ 25వ తేదీన తన భర్త కుమారస్వామిని హత్యచేసింది. తన భర్త అనారోగ్యంతో మృతి చెందాడని అందరిని నమ్మించి దహన సంస్కారాలు పూర్తి చేసింది.

తన తండ్రి మరణంపై అనుమానం వచ్చిన పెద్దకూతురు వర్షిణి తన తల్లిని నిలదీయడంతో అసలు కథ బయటపడింది. తన కూతురుకు అనుమానం వచ్చిందని కవిత తన ప్రియుడు రాజ్ కుమార్‌తో కలిసి కన్నకూతురును అతికిరాతకంగా హత్యచేసి అచ్చం సినీఫక్కిలో అందరి దృష్టి మరలచే ప్రయత్నాలు చేశారు. పోలీసుల విచారణలో అసలు గుట్టు రట్టయింది. కట్టుకున్న భర్తను.. ఆ తర్వాత కన్న కూతుర్ని అత్యంత దారుణంగా చంపిన ఆ తల్లితో పాటు ఆమె ప్రియుడు కూడా అరెస్టు అయ్యారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కారే వారిని రిమాండ్‌కు తరలించారు.టెక్నాలజీ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.