AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ట్రాఫిక్ చలాన్లు కాదు.. ముందు మీరు టాక్స్ కట్టండి..’ ఓ యువకుడి వింత నిరసన!

బైక్‌పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు. కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

‘ట్రాఫిక్ చలాన్లు కాదు.. ముందు మీరు టాక్స్ కట్టండి..’ ఓ యువకుడి వింత నిరసన!
A Young Man Protest On Road
G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 04, 2025 | 9:48 AM

Share

బైక్‌పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు. కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కరీంనగర్‌లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వాన్నంగా మారిపోయింది. కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని, పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కరీంనగర్‌కు చెందిన కోట శ్యామ్ కుమార్ నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు బాగా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని శ్యామ్ కుమార్ వాపోయారు. రోడ్డుపై వాహనం నడపాలంటేనే భయం వేస్తుందన్నారు. మరోవైపు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని పోలీసులు ఫైన్‌ల రూపంలో జరిమానాలు కట్టిస్తున్నారన్నారు. GST లు, రోడ్డు టాక్స్ కడుతున్నాను కానీ, అసలు రోడ్లే సరిగా లేవని శ్యామ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అధ్వాన్నంగా తయారైన రోడ్డుకు మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించారు. ముందుగా రోడ్లు నిర్మించి.. తరువాత ఫైన్ లు వసూలు చేయాలని డిమాండ్ చేశాడు. ఈ రోడ్డు కారణంగా చాలా మంది ప్రమాదాలకు గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని వేడుకున్నారు శ్యామ్ కుమార్.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?
వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ
ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ