AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాడిదకు రంగు వేసి జీబ్రాగా నమ్మించారు..అడ్డంగా దొరికిపోయారు! గమ్మత్తేమిటంటే..

ప్రపంచవ్యాప్తంగా చైనా దేశం డూప్లికేట్ వస్తువుల తయారీకి ఎంతగా ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఇప్పుడు చైనాలోని ఒక వైల్డ్‌లైఫ్ పార్క్ యాజమాన్యం ఏకంగా జంతువులను కూడా డూప్లికేట్ చేయడం ప్రారంభించింది. జూకు వచ్చే పర్యాటకుల సంఖ్యను పెంచుకోవడానికి, సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఒక సాధారణ గధేకు (Donkey) నలుపు, తెలుపు రంగులు వేసి జీబ్రా గా మార్చేసిన ఒక వింత ఘటన చైనాలో వెలుగుచూసింది. అసలేం జరిగిందంటే?

గాడిదకు రంగు వేసి జీబ్రాగా నమ్మించారు..అడ్డంగా దొరికిపోయారు! గమ్మత్తేమిటంటే..
Donkey Painted As Zebra
Jyothi Gadda
|

Updated on: Jun 24, 2026 | 8:17 PM

Share

చైనాలోని జూల నుండి తరచూ ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసే వింత వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటిదే మరో వార్త వైరల్‌గా మారింది. చైనాలోని షాన్‌డాంగ్ (Shandong) ప్రాంతంలో ఉన్న ఆన్‌కియు వైల్డ్‌లైఫ్ పార్క్‌కు (Anqiu Wildlife Park) కొంతమంది పర్యాటకులు వెళ్లారు. అక్కడ జీబ్రా ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఒక జంతువును చూసి వారు అవాక్కయ్యారు. నిశితంగా గమనిస్తే, ఆ జంతువు శరీరంపై చాలా అనాగరికంగా, అడ్డదిడ్డంగా నల్లటి చారలు పెయింట్ చేసి ఉన్నాయి. పైగా దాని పొడవాటి చెవులు, ముఖం స్పష్టంగా గాడిదలాగే ఉన్నాయి. అంతేకాకుండా, చుట్టుపక్కల మరికొన్ని గాడిదలు కూడా తిరుగుతూ ఉండటంతో జూ సిబ్బంది ఆడిన డ్రామా క్షణాల్లో బయటపడింది. పర్యాటకులు ఈ నకిలీ జీబ్రా వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

జూ సిబ్బంది ఇచ్చిన వింత వివరణ:

ఈ దారుణమైన మోసంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు, జోకులు వేయడం ప్రారంభించడంతో, పార్క్ యాజమాన్యం ఒక వింతైన, హాస్యాస్పదమైన వివరణ ఇచ్చింది. మేము ఎక్కడా అది అసలైన జీబ్రా అని బోర్డులు పెట్టలేదు, అలాగే పర్యాటకులను మోసం చేయాలని అనుకోలేదు. మేము కేవలం జంతువులతో కాస్‌ప్లే (Cosplay – అంటే వేషధారణ మార్చడం) చేయించాము. జూకు వచ్చే పర్యాటకులు కాస్త నవ్వుకుని, వినోదం పొందుతారనే ఉద్దేశంతోనే ఈ చిన్న జోక్ చేశాము అని సమర్థించుకున్నారు. అంతేకాదు, గతంలో తాము కొన్ని కుక్కలకు కూడా ఇలాగే పాండాల లాగా రంగులు వేసి ప్రదర్శించామని వారు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

నెటిజన్ల కామెంట్ల వర్షం:

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చైనాలో ఏదైనా సాధ్యమే, గాడిదను జీబ్రాను చేయడం వారి టాలెంట్ అని ఒకరు రాశారు. అయితే, జంతు హక్కుల సంఘాలు (PETA) మాత్రం ఇలా జంతువులపై కెమికల్ రంగులు వేయడం వాటి ఆరోగ్యానికి హానికరమని, కేవలం పబ్లిసిటీ కోసం జంతువులను వాడుకోవడం సరికాదని మండిపడుతున్నాయి. చైనా జూల చరిత్రలో ఇలాంటి ఘనకార్యాలు జరగడం ఇదే మొదటిసారి కాదు, గతంలోనూ కుక్కలకు రంగులు వేసి సింహాలుగా, పాండాలుగా చూపించిన ఘటనలు ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల