AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రద్దీ రోడ్డుపై ప్రకృతి వింత.. ముసురు వర్షంలో పింఛం విప్పి ఆడిన నెమలి.. ఏముంది మామ సీన్‌!

ముంబై నగరం అనగానే అందరికీ గుర్తొచ్చేది రద్దీగా ఉండే రోడ్లు, వాహనాల హడావుడి, ఎత్తైన భవనాలు. అయితే, ఈ బిజీ లైఫ్‌లో కొన్నిసార్లు ప్రకృతి మనకు ఊహించని అందాలను బహుమతిగా ఇస్తుంది. తాజాగా ముంబైలో కురుస్తున్న రుతుపవనాల వర్షాల వేళ అలాంటి ఒక అద్భుతమైన దృశ్యమే కెమెరాకు చిక్కింది. దక్షిణ ముంబైలోని వివిఐపి ప్రాంతంగా పేరుగాంచిన పెడ్డర్ రోడ్డులో ఒక అందమైన నెమలి పింఛం విప్పి నృత్యం చేయడం అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

రద్దీ రోడ్డుపై ప్రకృతి వింత.. ముసురు వర్షంలో పింఛం విప్పి ఆడిన నెమలి.. ఏముంది మామ సీన్‌!
Peacock Dancing In RainImage Credit source: Pinterest
Jyothi Gadda
|

Updated on: Jun 24, 2026 | 6:47 PM

Share

కాంక్రీట్ జంగిల్‌గా మారిన ముంబై మహానగరంలో ఒక అరుదైన, అందమైన దృశ్యం వెలుగుచూసింది. ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే పెడ్డర్ రోడ్డు (Pedder Road) పరిసరాల్లో, వర్షాకాలాన్ని (Monsoon) ఆహ్వానిస్తూ ఒక అందమైన నెమలి పింఛం విప్పి నాట్యం చేసింది. సాధారణంగా అడవుల్లో లేదా పచ్చని ప్రకృతిలో కనిపించే ఈ దృశ్యం, ఇలా నగర నడిబొడ్డున కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఒక బిల్డింగ్‌ బాల్కనీ గోడపై వాలిన నెమలి నాట్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మనోహరమైన దృశ్యం, నెటిజన్ల స్పందన గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మనసు దోచుకున్న మయూర నాట్యం:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. పెడ్డర్ రోడ్డు పరిసరాల్లోని ఒక నివాస భవనం ప్రహరీ గోడపై ఈ నెమలి నిలిచింది. ముంబైలో ముసురు వర్షం పడుతుండటంతో, వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆ నెమలి తన రంగురంగుల పింఛాన్ని విప్పి అటు ఇటు తిరుగుతూ నాట్యం చేయడం ప్రారంభించింది. చుట్టుపక్కల వాహనాల శబ్దాలు, నగర కోలాహలం ఉన్నప్పటికీ, వాటన్నింటినీ మర్చిపోయి ఆ నెమలి ప్రకృతి పరవశంలో మునిగిపోయింది.

ఇవి కూడా చదవండి

అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఈ అరుదైన దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాంక్రీట్ కట్టడాల మధ్య ఇలాంటి స్వచ్ఛమైన ప్రకృతి దృశ్యం కనిపించడం నిజంగా ఒక అద్భుతమని వారు పేర్కొన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

నెట్టింట వైరల్ – నెటిజన్ల కామెంట్ల వర్షం:

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి వేదికలపై అప్‌లోడ్ అయిన కొద్దిసేపట్లోనే విపరీతమైన వ్యూస్ సంపాదించుకుంది. వర్షంలో తడిసిన ముంబై అందాలకు ఈ నెమలి నాట్యం మరింత శోభను తెచ్చిపెట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముంబై లైఫ్ ఎంత బిజీగా ఉన్నా, ఇలాంటి దృశ్యాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి అని ఒకరు రాయగా, పకృతి తన ఉనికిని ఎప్పటికప్పుడు ఇలా చాటుకుంటూనే ఉంటుంది అని మరొకరు అభిప్రాయపడ్డారు.

వీడియో ఇక్కడ చూడండి..

సాధారణంగా ముంబైలోని రాజ్ భవన్ పరిసరాల్లో నెమళ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, ఇలా ప్రధాన రహదారి పక్కన, వర్షంలో పింఛం విప్పి ఆదమరచి నాట్యం చేయడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన