AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakes Dance: నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!

పాములు నృత్యం చేస్తాయని మీకు తెలుసా.. ఈ దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. అవును పాములు నృత్యం చేస్తాయి.. సహజంగా పుట్టల్లో దాగి ఉన్న పాములన్నీ వర్షా కాలం సీజన్‌లో బయటకు వస్తాయి. అలా వచ్చిన పాములు.. మరో పాములతో కలిసి ఆటలు ఆడుకుంటాయి. ముఖ్యంగా నాగు పాము, జెర్రి పోతు అయితే ఇవి ఎంతో ప్రేమగా నృత్యం చేస్తాయి. తాజాగా ఇలానే రెండు పాములు నృత్యం చేస్తున్న అద్భుతమైన దృశ్యాన్ని ఓ రైతు తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

Snakes Dance: నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!
Snake Dancing
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jul 14, 2025 | 4:23 PM

Share

జగిత్యాల జిల్లా మల్యాల మండలకేంద్రం శివారులోని ఓ వ్యవసాయ భూమిలో సోమవారం నాగుపాము, జెర్రిపోతులు బుసలు కొడుతూ కనిపించాయి. ఈ రెండు పాములు దాదాపు అరగంట పాటు సయ్యాట ఆడాయి. వ్యవసాయ పనుల నిమిత్తం పోలానికి వచ్చిన గడ్డం రాజేశం, నరహరి అనే ఇద్దరు రైతులు పొలంలో పాములు సయ్యాట ఆడటాన్ని చూశారు. మొదట పాములను చూసి భయపడిపోయిన రాజేశం, నరహరి.. తర్వాత వాటికి దూరంగా వెళ్లి అవి సయ్యాటలాడుతున్న దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించారు. ఆ పాములు సుమారు అరగంట పాటు ఇలానే నృత్యం చేస్తూ.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

అయితే తాను తీసిన వీడియోను రాజేశం సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వీడియో తీసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఇలాంటి దృశ్యాలను సినిమాలోనే చూశామని ఒకరు కామెంట్‌ చేయగా.. పాములను చూస్తేనే భయపడి పరుగులు తీస్తాం.. అలాంటి ఆరైతు ఎంత ధైర్యంతో ఎలా తీశాడో అని కామెంట్ చేశాడు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.