Minister Malla Reddy Vs IT officials: ల్యాప్‌టాప్‌ లాక్కొని, కీలక పత్రాలు చించేశారు.. మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదుపై హైకోర్టులో ఐటీ అధికారుల లంచ్‌ మోషన్‌ పిటిషన్‌..

మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరారు అధికారులు. ఐటీ అధికారుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. వాదనలకు అనుమతి ఇచ్చింది.

Minister Malla Reddy Vs IT officials: ల్యాప్‌టాప్‌ లాక్కొని, కీలక పత్రాలు చించేశారు.. మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదుపై హైకోర్టులో ఐటీ అధికారుల లంచ్‌ మోషన్‌ పిటిషన్‌..
Minister Malla Reddy Vs IT officials
Follow us

|

Updated on: Nov 25, 2022 | 3:16 PM

మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదుపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారు ఐటీ అధికారులు. తమ విధులకు మల్లారెడ్డి ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరారు అధికారులు. ఐటీ అధికారుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. వాదనలకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి పై ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ల్యాప్‌టాప్‌ లాక్కొని, కీలక పత్రాలు చించేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లారెడ్డి అనుచరులు ల్యాప్‌టాప్‌ను పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే.

ల్యాప్‌టాప్‌ ఇంకా బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లోనే ఉంది. ల్యాప్‌టాప్‌ను తీసుకెళ్లాలని ఐటీని బోయిన్‌పల్లి పోలీసులు కోరారు. అయితే ఆ ల్యాప్‌టాప్ తమది కాదని ఐటీ అధికారి రత్నాకర్ తెలిపారు. తమ ల్యాప్‌టాప్‌ను ఇప్పించాలని ఐటీ అధికారులు కోరుతున్నారు.

మరోవైపు.. ఐటి రెయిడ్స్‌లో బోయిన్‌పల్లి పీఎస్‌కు చేరిన ల్యాప్‌టాప్‌ పోలీసులకు తలనొప్పిగా మారింది. ల్యాప్‌టాప్‌ తీసుకెళ్లాలని ఐటి అధికారి రత్నాకర్‌ను కోరారు పోలీసులు. ఆ ల్యాప్‌టాప్ తమది కానప్పుడు ఎలా తీసుకెళ్లాలని ప్రశ్నిస్తున్నారు రత్నాకర్. తమ ల్యాప్‌టాప్‌ మంత్రి మల్లారెడ్డి దగ్గర ఉందని.. అది కావాలంటున్నారు. అదే నిజమైతే.. పీఎస్‌లో ఉన్న ల్యాప్‌టాప్‌ ఎవరిదన్న చర్చ ఇప్పుడు మొదలైంది.

ఐటీ అధికారులకు సంబంధించిన ల్యాప్‌టాప్‌నను అదే రోజు పీఎస్‌కు పంపించామన్నారు మల్లారెడ్డి. ఆ ల్యాప్‌టాప్‌.. పీఎస్‌లో ఉన్న ల్యాప్‌టాప్‌ ఒకటేనా.. మధ్యలో ల్యాప్‌టాప్‌ చేతులు మారిందా..? మొత్తానికి ఈ వ్యవహారం ఖాకీలకు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం