IT Companies: ప్రభుత్వ ఆదేశాలకు ఐటీ కంపెనీలు ససేమిరా.. అమలు అసాధ్యం!

తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ఐటీ కంపెనీలు ప్రభుత్వంతో విభేదిస్తున్నాయా? తాజాగా అందుతున్న సంకేతాలను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తుంది. ఏడాదిన్నర కాలంగా ఐటీ కంపెనీలు...

IT Companies: ప్రభుత్వ ఆదేశాలకు ఐటీ కంపెనీలు ససేమిరా.. అమలు అసాధ్యం!
Telangana
Follow us

|

Updated on: Jul 06, 2021 | 2:36 PM

IT Companies versus Telangana Government: తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ఐటీ కంపెనీలు ప్రభుత్వంతో విభేదిస్తున్నాయా? తాజాగా అందుతున్న సంకేతాలను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తుంది. ఏడాదిన్నర కాలంగా ఐటీ కంపెనీలు 90 శాతానికిపైగా తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయిస్తున్నాయి. ఇదే విధానాన్ని మరో ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు కొనసాగించాలని మెజారిటీ ఐటీ కంపెనీలు, ఐటీ ఆధారిత సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు తమ ఉద్యోగులకు ఆదేశాలను కూడా జారీ చేశాయి. అయితే.. కరోనా వైరస్ మొదటి వేవ్ ముగిసిన పరిస్థితుల్లో కొంత సాధారణ పరిస్థితి కనిపించినా ప్రభుత్వం ఐటీ కంపెనీలను వర్క్ ఫ్రమ్ హోం నిలిపేయాలని ఆదేశించలేదు. సరికదా.. వర్క్ ఫ్రమ్ హోంపై నిర్ణయాన్ని ఆ కంపెనీలకే వదిలేసింది. దాంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితం చేశాయి. కొన్ని కంపెనీలైతే ఈ విధానమే తమకు భేషుగ్గా వుందని కూడా ప్రకటించాయి.

2021 మార్చి ఆఖరు వారం తర్వాత రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. ఏప్రిల్ మూడో వారం నుంచి జూన్ రెండో వారం దాకా సెకెండ్ వేవ్ ఉధృతి కనిపించింది. దాంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానంవైపే మొగ్గు చూపాయి. ఇంకోవైపు థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయన్న ప్రచారంతో ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరో ఆరు నుంచి ఎనిమిది నెలలు కొనసాగించాలని నిర్ణయించాయి. అయితే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం విధానానికి స్వస్తి పలికి.. ఉద్యోగులను తమ తమ ప్రాంగణాల్లో పని చేసేలా చూడాలని ఆదేశాలిచ్చింది. కానీ.. ప్రభుత్వం ఇచ్చిన రిటర్న్ టు ఆఫీస్ (ఆర్2ఓ) విధానంపై ఐటీ కంపెనీలు, వాటి ఆధారిత సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తాజాగా సంకేతాలందుతున్నాయి.

నిజానికి సెకెండ్ వేవ్ వచ్చే ముందు సుమారు 8 శాతం ఉద్యోగులను ఆఫీసుల నుంచి పని చేసేలా ఐటీ సంస్థలు ఏర్పాట్లు చేశాయి. జులై నాటికి 30 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ ఆఫీసు చేసేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. కానీ అనుకోకుండా ఏప్రిల్ నుంచి సెకెండ్ వేవ్ ఉధృతి పెరిగింది. దాంతో వర్క్ ఫ్రమ్ ఆఫీసు విధానంపై తాము మొగ్గు చూపలేదని హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్.. (హైసియా) ప్రెసిడెంట్ భరణీ కుమార్ తెలిపారు. ప్రస్తుతం 10 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుల నుంచి విధులు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. అయితే.. చిన్న ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ ఆఫీసు పట్ల మొగ్గు చూపుతున్నాయని, పెద్ద సంస్థలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోం పట్ల ఆసక్తిగా వున్నాయని ఆయన చెబుతున్నారు.

కరోనా వైరస్‌ను ఓడించామన్న సంకేతాలను ఉద్యోగుల్లో నెలకొల్పినపుడే వారిని ఆఫీసులకు రప్పించగలమని, బలవంతంగా ప్రభుత్వ అధికారాన్ని, ఆదేశాలను తమ ఉద్యోగులపై రుద్దలేమని భరణీ కుమార్ చెబుతున్నారు. ప్రస్తుతం తమ తమ ఇళ్ళ నుంచి పని చేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 6 లక్షల మంది ఆఫీసులకు వచ్చేందుకు సుముఖంగా లేరని ఆయన అంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేస్తూ.. తమ సంస్థలకు మెరుగైన సర్వీసులను అందించేందుకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్నే మరికొన్ని నెలల పాటు కొనసాగించేందుకు ప్రభుత్వం కూడా సహకరించాలని భరణీ కుమార్ కోరారు. అయితే, ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అవలంభిస్తుందో.. ఐటీ కంపెనీల అభిమతాన్ని పరిగణలోకి తీసుకుంటుందో.. లేక వర్క్ ఫ్రమ్ ఆఫీసుపై నిర్దిష్టమైన ఆదేశాలను జారీ చేస్తుందో వేచి చూడాల్సి వుంది.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!