Irani Chai: టీ ప్రియులకు చేదువార్త.. ఇరానీ చాయ్ ధర పెంపు.. ఒక కప్పుకు ఎంత పెంచారంటే
టీ (Tea) తాగితే మనసుకు కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. ఒత్తిడికి గురైన వారు ఎందరో టీ తాగుతూ రిలాక్స్ అవుతూ ఉంటారు. అందులో ఇరానీ చాయ్(Irani Chai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రుచిలో అమోఘంగా...
టీ (Tea) తాగితే మనసుకు కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. ఒత్తిడికి గురైన వారు ఎందరో టీ తాగుతూ రిలాక్స్ అవుతూ ఉంటారు. అందులో ఇరానీ చాయ్(Irani Chai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రుచిలో అమోఘంగా ఉండే ఈ చాయ్ అంటే టీ ప్రియులకు ఎంతో ఇష్టం. ఒక్కో సిప్ తాగుతూ అనుభూతి చెందుతూ ఆస్వాదిస్తుంటారు. అయితే అలాంటి వారికి ఓ చేదువార్త. ఇకపై ఇరానీ చాయ్ టేస్ట్ చేయాలంటే రూ.20 ఖర్చు పెట్టాల్సిందే. వివిధ కారణాల దృష్ట్యా ధర పెంచుతున్నట్లు హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయించారు. కరోనా(Corona) కారణంగా హోటళ్ల నిర్వహణ కష్టతరమైంది. పెరుగుతున్న నిత్యావసర ధరలతో హోటళ్ల మనుగడ సాగని క్రమంలో ఇరానీ చాయ్ ధర పెంచుతూ హోటళ్ల బృందం నిర్ణయం తీసుకుంది. కరోనాకు ముందు ఒక కప్పు ఫుల్ ఇరానీ చాయ్ ధర రూ.10, కానీ ఇప్పుడు ఆ ధర రూ.20కు చేరింది. భారీ నష్టాల నేపథ్యంలో ఆ నష్టాల నుంచి బయట పడేందుకు ధర పెంచడం తప్పలేదని ఓ హోటల్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇరానీ టీపొడి ధర కిలో రూ.300నుంచి రూ.500కు చేరుకొంది. పాలు లీటరుకు రూ.100కు చేరింది. వాణిజ్యం సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. వర్కర్ల రోజూ వారీ భత్యం కూడా కాస్త పెరిగింది. పింగాణీ కప్పులకు బదులుగా పేపర్ కప్‌లను ఉపయోగించాల్సి వస్తోంది. దీంతో ఆ కప్పులకు అయ్యే ఖర్చులు కేఫ్‌ల యాజమాన్యాలకు అదనపు భారంగా మారాయి. లాక్ డౌన్ అనంతరం అసలు వ్యాపారం సాగడం లేదని యజమానులు పేర్కొన్నారు. కరోనా తర్వాత నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో.. పాత ధరకు విక్రయించడం సాధ్యం కాదని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇరానీ చాయ్ తయారు చేయడమూ ఓ ప్రత్యేక కళే. పాలు, టీ పొడి, నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడినా ప్రత్యేక రుచి రాదు.
Also Read
Weekend Special Recipe: మీకు టేస్టీ, స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తే.. శెనగ పిండితో ఇలా చేయండి..
Gangubai Kathiawadi: ‘ఆలియా’ అంటే ఆమాత్రం ఉంటది మరి.. ఏకంగా థియేటర్‌నే బుక్ చేసిన పాక్ నటుడు..!