Instagram : ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం.. ఆకలి అని వచ్చారు.. అందిన కాడికి దోచుకెళ్లారు..
Instagram : హైదరాబాద్‌లో భాగ్యనగరంలో అంతరాష్ట్ర దొంగల ముఠా రెచ్చిపోయింది. ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకుని ఆకలి పేరుతో వచ్చి..

Instagram : హైదరాబాద్‌లో భాగ్యనగరంలో అంతరాష్ట్ర దొంగల ముఠా రెచ్చిపోయింది. ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకుని ఆకలి పేరుతో వచ్చి.. అందిన కాడికి దోచుకెళ్లారు దుండగులు. చివరికి ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు వారి కట్టించడంతో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ దొంగల ముఠా గురించి మహేష్ భగవత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అప్పుల బాధలు తట్టుకోలేక నలుగురు వ్యక్తులు నేరాల బాట పట్టారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన వడ్లమూడి నిఖిల్, వడ్లమూడి వినయ్ చౌదరి, ఏళ్ల ఉదయ్ కుమార్, గోగినేని బ్రహ్మ తేజ.. ఈనెల 15 వ తేదీన వనస్థలిపురంలో హెల్ప్ కిడ్స్ హ్యాపీ కిడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సతీష్‌ను ఇన్‌స్టాగ్రమ్‌లో పని చేసుకున్నారు. ఆకలి వేస్తోందంటూ ఈ నలుగురు నిందితులు సతీష్ ఇంటికి వచ్చారు. ఆ వెంటనే సతీష్ చేతులు, కాళ్లు కట్టేశారు. పాస్ పోర్ట్, మొబైల్ ఫోన్, కారు, బైక్, దేశీ, విదేశీ కరెన్సీ నోట్లను ఎత్తుకెళ్లారు. ఆ తరువాత సతీష్ ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం రూ. 26 లక్షల 5 వేల విలువ జేసే ఒక క్రెట కారు, హ్యుందాయ్ ఇయాన్ కారు, కేటీఎం బైక్, మూడు మొబైల్స్ ఫోన్స్, ఒక హెచ్‌పి లాప్టాప్, నగదు రూ. 25, 000 వేలు, ఫారిన్ కరెన్సీ (48) రూ. 2 లక్షల, 2బొమ్మ పిస్టల్, ధ్రువ ఎలుగు బంటి గోరు ( దీని విలువ లక్ష రూపాయల విలువ ) స్వాధీనం చేసుకున్నారు. కాగా, వడ్లమూడి నిఖిల్ కర్ణాటకలో 4 కేసులు నమోదయ్యాయని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఒక కేసు ఉందని సీపీ వెల్లడించారు.
Also read:
కర్ణాటక ముఖ్యమంత్రిపై మండిపడిన ఆ రాష్ట్ర హైకోర్టు.. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల ఉపసంహరణలో




