ఆ ఇంటి సమీపంలో మూడు రోజులుగా పాములు వస్తూనే ఉన్నాయి.. మరి ఆ ఇంటివారు ఏం చేశారంటే..

Snakes in Village: ఆ ఇంటి సమీపంలో గత మూడు రోజుల నుంచి పాములు వస్తూనే ఉన్నాయి. తొలుత వచ్చిన పాములను వచ్చినట్లే..

  • Shiva Prajapati
  • Publish Date - 12:03 pm, Fri, 16 April 21
ఆ ఇంటి సమీపంలో మూడు రోజులుగా పాములు వస్తూనే ఉన్నాయి.. మరి ఆ ఇంటివారు ఏం చేశారంటే..
Snakes

Snakes in Village: ఆ ఇంటి సమీపంలో గత మూడు రోజుల నుంచి పాములు వస్తూనే ఉన్నాయి. తొలుత వచ్చిన పాములను వచ్చినట్లే చంపేశారు. కానీ ఇవాళ ఏకంగా 15 పాములు వచ్చాయి. దాంతో ఆ ఇంటి వాసులతో పాటు.. గ్రామప్రజలు హడలిపోయారు. ఈ భీతావహ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ భయానక ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో పాములు కలకలం సృష్టించాయి. ఆ గ్రామస్తులందరినీ హడలెత్తించాయి. పైతర గ్రామంలో కుమ్మరి శంకరయ్య ఇంటి మోరీ ఉంది. ఆ మోరీ నుంచి గత మూడు రోజుల నుంచి వరుసగా పాములు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కటిగా వచ్చిన పాములను ఇంటి యజమాని, మరికొందరు గ్రామస్తులు కొట్టి చంపారు. అయినప్పటికీ పాములు కుప్పలగా వస్తూనే ఉన్నాయి.

గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా 15 కు పైగా పాములు వచ్చాయి. దాంతో కుమ్మరి శంకరయ్య, గ్రామ ప్రజలు హడలిపోయారు. అన్ని పాములు వరుసగా రావడంతో భయబ్రాంతులకు గురయ్యారు. మొత్తంగా ధైర్యం చేసి వీటిలో కొన్ని పాములను చంపేయగా.. మరికొన్ని పాలుము తప్పించుకున్నాయి. దాంతో ఆ గ్రామ ప్రజలు భయం భయంగా ఉన్నారు. పాముల బెడద నుంచి తమను రక్షించాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ అధికారులు.. పాములు వచ్చిన మోరీని పరిశీలించారు. పాముల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు.

Also read:

Sonu Sood : బ్యాండ్ వాలాగా మారిన రియల్ హీరో.. సోనులోని టాలెంట్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్…

NCC As Elective Subject: ఎలెక్టివ్ సబ్జెక్ట్‌గా NCC.. యూజీసీ ప్రతిపాదన.. అన్ని యూనివర్సిటీలకు లేఖ.!

ఊరూ వాడా అందరినీ పిలిచాడు.. అంగరంగ వైభవంగా వేడుక చేశాడు.. ఎందుకో కారణం తెలిస్తే షాక్ అవుతారు..