Corona Effect: మళ్లీ సొంతూళ్లకు పయనమవుతోన్న వలస కూలీలు.. కలవర పెడుతోన్న కరోనా సెకండ్ వేవ్..
Corona Effect: ఏడాది క్రితం ప్రపంచ మానవాళిని భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఆరోగ్యం నుంచి ఆర్థికం వరకు మనుషులతో చలగాటమాడింది. కరోనా లాక్‌డౌన్..
Corona Effect: ఏడాది క్రితం ప్రపంచ మానవాళిని భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఆరోగ్యం నుంచి ఆర్థికం వరకు మనుషులతో చలగాటమాడింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది వలస కూలీలు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. పనులు లేకపోవడంతో పట్టణాల నుంచి సొంతూళ్లకు కూలీలు పోటేత్తారు. రవాణా అందుబాటులో లేకపయే సరికి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితులే ఎదురు కానున్నాయా? అంటే పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఊపందుకుంటోంది. గతేడాదిని మించి కేసులు నమోదవుతుండడంతో అంతా అలర్ట్ అవుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తుండడంతో వలస కూలీలు ముందు జాగ్రత్త పడుతున్నారు ఈ నేపథ్యంలోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూలీలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇక హైదరాబాద్‌లోనూ వలస కూలీల తిరుగు ప్రయాణం కనిపిస్తోంది. ఇప్పటికే గత నాలుగు రోజులుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక వైపు వెళ్తున్న వాహనాల్లో పెద్ద ఎత్తున కూలీలు స్వస్థలాలకు వెళుతున్నట్లు సమాచారం. కరోనా కేసులు పెరుగుతుండడం, అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తుండడంతో భయాందోళనకు గురవుతోన్న కూలీలు సొంతూళ్లకు పయనమవుతున్నట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా కరోనా సెకండ్ వేవ్ మరోసారి ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
COVID-19: ఇలాంటి ఫుడ్ తినేవారికి ఈజీగా కోవిడ్ రావడం ఖాయం అంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిక
‘లో బీపీ’ ఉందని ఎలా తెలుస్తుంది..? ఈ లక్షణాలు మీలో ఉన్నాయా..! ఒక్కసారి చెక్ చేసుకోండి..