AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19: ఇలాంటి ఫుడ్ తినేవారికి ఈజీగా కోవిడ్ రావడం ఖాయం అంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిక

COVID-19:దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ.. కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ లో రోజు రోజుకీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం జనంలో చోటులో చేసుకున్న నిర్లక్ష్యమని.. ముఖ్యంగా చాలా...

COVID-19:  ఇలాంటి ఫుడ్ తినేవారికి ఈజీగా కోవిడ్ రావడం ఖాయం అంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిక
Food Ahabits
Surya Kala
|

Updated on: Apr 16, 2021 | 1:58 PM

Share

COVID-19:దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ.. కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ లో రోజు రోజుకీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం జనంలో చోటులో చేసుకున్న నిర్లక్ష్యమని.. ముఖ్యంగా చాలా మంది మాస్కలు ధరించని కారణంగానే కేసులు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నా తప్పని సరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని చేతులను తరచుగా శానిటైజ్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలా కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి మనం తినే ఆహారం కూడా ఒక కారణమని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తినే ఆహారం విషయం సమతుల్యం పాటించాలని.. అలాంటి వారికి కరోనా సోకె అవకాశాలు తక్కువని..లేదంటే కోవిడ్ సోకినా ప్రభావం అంతంత మాత్రంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే తప్పఁనిసరిగా పౌష్టికారాహాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. కోవిడ్ మనకు దూరంగా ఉండాలంటే .. ముందు ఈ ఆహారపు అలవాట్లను దూరంగా ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. అవి ఏమిటో ఓ లుక్ వేద్దాం..!

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఒత్తిడి, మానసిక క్షోభ, ఆర్థిక ఇబ్బందులు తినే ప్రవర్తనలో మార్పులు వంటి అనేక అంశాలపై పలు అధ్యయనాలు నిర్వహించారు పరిశోధకులు. ఈ అధ్యయనంలో భాగంగా ఆహారపు అలవాట్ల గురించి పలువురిని ప్రశ్నించారు.. ఆరోగ్యాన్ని పరిశీలించారు. వారిలో సుమారు 8 శాతం మంది అనారోగ్యాన్ని కలిగించే బరువు ఉన్నారు.. మరో ఆకలి లేకపోయినా 14 శాతం మంది అతిగా జంక్ ఫుడ్ తినడం అలవాటు ఉన్నవారిగా గుర్తించారు. ఇలా సరైన ఆహారపు అలవాట్లు లేనివారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్లు ఈ అధ్యయనాలద్వారా తెలిసింది. ముఖ్యంగా కొంతమంది ఆకలి లేకుండా తింటారు.. ముఖ్యంగా చిప్స్, జంక్ ఫుడ్ వంటివి ఎప్పుడు పడితే అప్పుడు.. తింటారు. దీని వలన అనేక రోగాల బారిన పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఈటింగ్ డిజార్డర్స్ లో అధ్యయనం లో కొందరు ఆకలిగా లేకున్నా తినడం లాంటివి చేస్తున్నారని తేలింది. ఇలా అస్తవ్యస్తంగా తినడం వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. దాదాపు 700 మందిపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

ఇక సరైన ఆహార నియమాలు పాటించని కారణంగా ప్రతి సంవత్సరం 10,200 మంది మరణిస్తున్నారట.. అంటే.. ప్రతి 52 నిమిషాలకొకరు చనిపోతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మంచి ఆహార నియమాలు పాటించకుండా ఎప్పుడూ జంక్ ఫుడ్ తినే వారిలో మానసిక సమస్యలతోపాటు.. అధిక మరణాల రేటు కూడా నమోదౌతుందని హెచ్చరిస్తున్నారు.

Also Read: రంజాన్ నెలలో ఉపవాస దీక్ష చేస్తున్నారా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇఫ్తార్ విందులో వీటిని చేర్చుకుంటే సరి  

నువ్వు అబద్ధం చెప్పావని తెలిస్తే.. అంటూ కార్తీక్ వార్నింగ్ .. తప్పులను గుర్తుచేసుకుంటూ షాక్‌లో మోనిత