AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19: మట్టిలో నెలరోజుల పాటు సజీవంగానే కరోనా వైరస్..కొత్త టెన్షన్ పుట్టిస్తున్న తాజా పరిశోధనలు!

కరోనా వ్యాప్తి.. కరోనా జీవిత కాలం.. కరోనా ఎక్కడ ఎంతసేపు మనగలుగుతుంది వంటి విషయాల్లో ఇప్పటికీ ఒక లెక్క కుదరడం లేదు. రోజుకో రకమైన పరిశోధనా ఫలితాలు వెలువడుతున్నాయి.

COVID-19: మట్టిలో నెలరోజుల పాటు సజీవంగానే కరోనా వైరస్..కొత్త టెన్షన్ పుట్టిస్తున్న తాజా పరిశోధనలు!
Corona-Virus
KVD Varma
|

Updated on: Apr 16, 2021 | 4:40 PM

Share

COVID-19: కరోనా వ్యాప్తి.. కరోనా జీవిత కాలం.. కరోనా ఎక్కడ ఎంతసేపు మనగలుగుతుంది వంటి విషయాల్లో ఇప్పటికీ ఒక లెక్క కుదరడం లేదు. రోజుకో రకమైన పరిశోధనా ఫలితాలు వెలువడుతున్నాయి. తాజాగా కరోనా మట్టిలో ఏకంగా ఒకనెల రోజుల వరకూ మనుగడ సాగిస్తుందని ఒక పరిశోధనా ఫలితం పేర్కొంది. ఆసుపత్రులు, స్కూల్స్ లో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఇదే కారణం కావచ్చని ఆ పరిశోధనలు చెబుతున్నాయి. కరోనా ఉధృతిని తెలుసుకోవడం కోసం కొన్ని పరిశోధనా సంస్థలు వేర్వేరు దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో వ్యర్థజలాలు, మురుగు నీటిపై పరిశీలనలు జరిపాయి. అదేవిధంగా మట్టిపై కూడా ఇవి పరిశోధనలు చేశాయి. దీనివలన ఆసుపత్రులు, విద్యాసంస్థలలో కరోనా ఉధృతి తెలుసుకోవడానికి వీలవుతుందని అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా బాధితులను ఉంచిన రూముల్లో వీరు పరిశోధనలు చేశారు. అదేవిధంగా పాజిటివ్ గా తేలిన వ్యక్తుల ఇల్లనుంచీ నమూనాలను సేకరించారు. ఆయా ప్రాంతాల్లో వ్యాక్యూం ప్యాక్ లలో మట్టిని కూడా వారు పరిశీలించారు. అలాగే గదుల ఉపరితలం నుంచి కూడా నమూనాలను తీసుకుని పరిశోధనలు కానిచ్చారు. దీని ప్రకారం మట్టినమూనాల్లో 95 శాతం, ఉపరితల నమూనాల్లో 55 శాతం మేర కరోనా ఆర్ఎన్ఏ జీవించి ఉంటోందని తేల్చారు. అయితే, ఈ మట్టి కణాల్లో జీవిస్తున్న కరోనా వైరస్ మానవులకు సోకే అవకాశం ఎంతవరకూ ఉందనేది శాస్త్రవేత్తలు తేల్చలేదు. కనీ, కరోనా వైరస్ పైన ఉండే కొమ్ముల్లాంటి ఆకృతిలో ఉండే వెలుపలి పోర మాత్రం దుమ్ము కణాల్లో ఉన్న వైరస్ లో విచ్చిన్నం అవుతోందని తేల్చారు. మానవులలో వైరస్ వ్యాప్తి చేయడంలో ఈ పోరాదే ముఖ్యమైన పాత్ర.

ధూళిలో కరోనా వైరస్‌ ఏకంగా ఒక నెల వరకూ మనుగడ సాగించగలదని తాజా అధ్యయనం పేర్కొంది. ఆసుపత్రులు, పాఠశాలల్లో మహమ్మారి విస్తృతిని అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. స్థానికంగా కరోనా ఉద్ధృతిని తెలుసుకోవడానికి ఆయా ప్రాంతాల్లోని వ్యర్థజలాలు, మురుగు నీటిపై అనేక దేశాలు.. పరిశీలనలు చేపట్టాయి. అక్కడి ప్రజల్లో వ్యాధి లక్షణాలేమీ లేనప్పటికీ కొవిడ్‌ తీవ్రతపై ఒక అంచనాకు రావడానికి ఆ వివరాలు ఉపయోగపడ్డాయి. ఇదే విధంగా ధూళిపైనా పరిశోధనలు చేయడం ద్వారా ఆసుపత్రులు, పాఠశాలల్లో కరోనా ఉద్ధృతిని అర్థం చేసుకోవడానికి వీలవుతుందని అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీరు కొవిడ్‌ బాధితులను ఉంచిన గదులపై పరిశీలనలు చేపట్టారు. అలాగే పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల ఇళ్లల్లో నుంచి కూడా నమూనాలను సేకరించారు. అక్కడ వాక్యూమ్‌ బ్యాగ్‌ల నుంచి సేకరించిన ధూళిని పరిశీలించారు. గదుల ఉపరితలం నుంచి నమూనాలను తీసుకొని విశ్లేషించారు. ధూళి నమూనాల్లో 97 శాతం మేర, ఉపరితల నమూనాల్లో 55 శాతం మేర కరోనా జన్యుపదార్థమైన ఆర్‌ఎన్‌ఏ మనుగడ సాగించగలుగుతోందని తేల్చారు. మానవులకు వైరస్‌ను వ్యాప్తి చేసే సామర్థ్యం ఈ ధూళికి ఉందా అన్నదానిపై శాస్త్రవేత్తలు పరిశీలన సాగించలేదు. ధూళిలో ఉన్నప్పుడు కొంతకాలానికి.. కరోనా వైరస్‌లో కొమ్ముల్లాంటి ఆకృతులతో కూడిన వెలుపలి పొర విచ్ఛిన్నమవుతుందని పరిశోధకులు తెలిపారు. మానవుల్లోకి వైరస్‌ను వ్యాప్తి చేయడంలో ఈ పొరదే కీలక పాత్ర.

Also Read: నేటి నుంచి చార్మినార్, గోల్కొండ సందర్శన బంద్.. కరోనా నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ కీలక ఆదేశాలు

Corona Effect: మళ్లీ సొంతూళ్లకు పయనమవుతోన్న వలస కూలీలు.. కలవర పెడుతోన్న కరోనా సెకండ్‌ వేవ్‌..