COVID-19 Patients: కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో ఆరు నెలల తర్వాత ఇబ్బందులు.. గుర్తించిన పరిశోధకులు
COVID-19 Patients: కోవిడ్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన మూడొంతుల మంది ఆరు నెలల తర్వాత కూడా ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు...
COVID-19 Patients: కోవిడ్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన మూడొంతుల మంది ఆరు నెలల తర్వాత కూడా ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నల్ లాన్సెట్‌లో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా పుట్టకకు వేదికైన చైనాలోని వుహన్‌లో వంద మంది కరోనా బారిన పడిన వారిని పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని వారు వెల్లడించారు. దీంతో కోవిడ్ ప్రభావాలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
కోవిడ్ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కండరాలు బలహీనపడటం, సరైన నిద్ర లేకపోవడం తదితర లక్షణాలను ప్రధానంగా గుర్తించినట్లు వారు వివరించారు. కరోనా బారిన పడిన వారి ఆరోగ్యంపై వైరస్ దీర్ఘకాలిక ఎలా ప్రభావాలను చూపుతుందో అర్థం చేసుకుంటున్నామని నేషనల్ సెంటర్ ఫర్ రెస్పిరేటరీ మెడిసిన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన 1655 మంది బాధితులను పరిశీలించగా, 1265 మందిలో ఏదో ఒక లక్షణం గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇందులో 63 శాతం మంది కండరాల బలహీనతతో, 26 శాతం నిద్రలేమితో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. అలాగే రోగనిరోధశ స్థాయి సైతం 52.2 శాతం మేర తగ్గినట్లు గుర్తించామన్నారు.