‘లో బీపీ’ ఉందని ఎలా తెలుస్తుంది..? ఈ లక్షణాలు మీలో ఉన్నాయా..! ఒక్కసారి చెక్‌ చేసుకోండి..

BP Symptoms : నిత్యం ఉద్యోగం చేసే మహిళలు, పురుషులు వారికి తెలియకుండానే లో బీపీకి గురవుతున్నారు. ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోతున్నారు. అప్పుడు కానీ తెలియడం లేదు వారికి

  • uppula Raju
  • Publish Date - 1:46 pm, Fri, 16 April 21
'లో బీపీ' ఉందని ఎలా తెలుస్తుంది..? ఈ లక్షణాలు మీలో ఉన్నాయా..! ఒక్కసారి చెక్‌ చేసుకోండి..
Bp Symptoms

BP Symptoms : నిత్యం ఉద్యోగం చేసే మహిళలు, పురుషులు వారికి తెలియకుండానే లో బీపీకి గురవుతున్నారు. ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోతున్నారు. అప్పుడు కానీ తెలియడం లేదు వారికి ఈ సమస్య ఉందని. చాలా మంది ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. తినే తిండి, వ్యాయామం చేయకపోవడం, సమయ పాలన పాటించకపోవడం, రాత్రిళ్లు ఎక్కువ టైం మేల్కొనడం లాంటి కారణాలు ఉన్నాయి. దీనిని చాలా మంది లైట్ తీసుకుంటారు కానీ ఒక్కోసారి ఇది ప్రాణాల మీదకు తెస్తోంది. ముఖ్యంగా మహిళలు దీని భారిన ఎక్కువగా పడుతుంటారు. అయితే లో బీపీ ఉందని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వైద్య శాస్త్రం ప్రకారం డయాస్టోలిక్ ప్రెషర్ 95 mmHg దాటకూడదు. అలాగే సిస్టోలిక్ 140 mmHg మించకూడదు. ఇవి రెండూ చాలా తక్కువగా ఉంటే… లోబీపీ ఉన్నట్లే. ఇది మహిళల్లో… 60/100 , మగవారిలో 70/110 కంటే తక్కువగా ఉంటే లోబీపీ ఉన్నట్లే. మనకు లోబీపీ ఉందా లేదా అన్నది కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. కూర్చొని పైకి లేచినప్పుడు తల దిమ్ముగా అనిపిస్తుంది. కళ్లు మసకగ్గా కనపిస్తాయి. త్వరగా అలసిపోతారు. ఎక్కువ సేపు పనిచేయలేరు. తేలికగా తలనొప్పి , వికారంగా ఉంటుంది. అప్పడప్పుడు మూర్ఛ కూడా వస్తుంది. తరచూ ఇలాగ ఉంటే లోబీపీ కావచ్చు.

మగవారిలో కంటే మహిళల్లో లోబీపీ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ రక్తస్రావం అయితే… అది లోబీపీకి దారి తియ్యవచ్చు. కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్టుల వల్ల కూడా లోబీపీ వచ్చే ఛాన్స్‌ ఉంది. సింపుల్‌ గా చెప్పాలంటే లోబీపీ ఉందంటే బాడీలో సరిపడా రక్తం లేదని అర్థం. అందువల్ల లోబీపీ లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లడం మంచిది. నీరు సరిపడా తాగాలి. రక్తం పడే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

Movie Actress: నమ్మించి మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించిన సినీ నటి.. సంచలనంగా మారిన వివాదం..

Corona Pandemic: కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న పరిస్థితుల్లో బ్యాంకుల పని వేళలు తగ్గించాలని కోరుతున్న యూనియన్లు!

IPL 2021 : స్ట్రైక్‌ రేట్‌లో మనీశ్ పాండే చాలా బెటర్..! అతడితో పోలిస్తే ఢిల్లీ, చెన్నై ఆటగాళ్లు చాలా తక్కువ..