AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మాస్క్’ నిబంధన ఉల్లంఘిస్తే రూ.10 వేల ఫైన్…యూపీ సర్కారు సంచలన నిర్ణయం

Uttar Pradesh Coronavirus News: కరోనా మహమ్మారిని కట్టడి చేసే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచలన ప్రకటన చేసింది.

‘మాస్క్’ నిబంధన ఉల్లంఘిస్తే రూ.10 వేల ఫైన్...యూపీ సర్కారు సంచలన నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
Janardhan Veluru
|

Updated on: Apr 16, 2021 | 2:44 PM

Share

కరోనా మహమ్మారిని కట్టడి చేసే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మాస్క్ ధరించని వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. మాస్క్ లేకుండా తొలిసారిగా పట్టుబడితే రూ.1000లు, రెండోసారి పట్టుబడితే రూ.10వేలు జరిమానా విధించనున్నారు.

అలాగే ఆదివారంనాడు రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. అయితే అత్యవసర సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కరోనా ఉధృతి నేపథ్యంలో మే 15 వరకు స్కూల్స్, కాలేజీలను మూసివేస్తూ గురువారం యూపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. బోర్డ్ ఎగ్జామ్స్‌ను కూడా వాయిదావేసింది. ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో బుధవారం 20,510 కరోనా కేసులు నమోదుకాగా…గురువారంనాడు 22,439 కేసులు, 104 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలుచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..కర్ణాటక సీఎం యడ్యూరప్పకు కరోనా పాజిటివ్.. మణిపాల్ హాస్పిటల్‌కు తరలింపు..

మళ్లీ సొంతూళ్లకు పయనమవుతోన్న వలస కూలీలు.. కలవర పెడుతోన్న కరోనా సెకండ్‌ వేవ్‌..

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సుర్జేవాలా, దిగ్విజయ్ సింగ్‌కు పాజిటివ్..