Coronavirus: దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సుర్జేవాలా, దిగ్విజయ్ సింగ్‌కు పాజిటివ్..
Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.
Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రణదీప్ సుర్జేవాలా, దిగ్విజయ్ సింగ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ‘నేను ఇవాళ ఉదయం కోవిడ్19 పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్ అని తేలింది. గడిచిన ఐదు రోజులుగా నన్ను ఎవరైనా సంప్రదించినట్లయితే.. దయచేసి వారంతా తగిన చర్యలు తీసుకోండి. కోవిడ్ టెస్ట్ చేయించుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి’’ అని కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిథి అయిన రణదీప్ సుర్జేవాలా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియన్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా తనకు కోవిడ్-19 పాజిటివ్ అని వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, ఈ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇదిలాఉంటే.. కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో విపరీతంగా పెరుగుతుంది. శుక్రవారం నాడు ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 2,17,353 కొత్త పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో ఇప్పటి వరకు దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,42,91,917కు చేరింది. ఇక రోజూ వారి కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. టోటల్‌గా చూసుకుంటే కరోనా బాధితుల మరణాల సంఖ్య 1,74,308 కి చేరింది.
Also read:
Movie Actress: నమ్మించి మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించిన సినీ నటి.. సంచలనంగా మారిన వివాదం..