ఊరూ వాడా అందరినీ పిలిచాడు.. అంగరంగ వైభవంగా వేడుక చేశాడు.. ఎందుకో కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Calf Birth Celebrations: ఏ దంపతులైనా తమకు సంతానం కలిగినప్పుడు చాలా సంతోషిస్తారు. ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవడం కోసం..

  • Shiva Prajapati
  • Publish Date - 11:37 am, Fri, 16 April 21
ఊరూ వాడా అందరినీ పిలిచాడు.. అంగరంగ వైభవంగా వేడుక చేశాడు.. ఎందుకో కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Celebrations

Calf Birth Celebrations: ఏ దంపతులైనా తమకు సంతానం కలిగినప్పుడు చాలా సంతోషిస్తారు. ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవడం కోసం బంధుమిత్రులు, ఊరూ.. వాడా.. అందరినీ పిలిచి వేడుకలు చేస్తారు. బారసాల, నామకరణం.. ఇలా ప్రతీది ఓ పండుగలా జరుపుకుంటారు. ఇలాంటి ఘటనలు మన చుట్టూ నిత్యం ఎక్కడోచోట జరుగుతూనే ఉంటాయి. మరి తాము పెంచుకున్న ఓ మూగజీవి బిడ్డకు జన్మనిస్తే.. ఆ బిడ్డకు బారసాల, నామకరణం చేసి వేడుకను చేయడం ఎప్పుడైనా చూశారా? పోనీ విన్నారా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. అవును.. ఓ వ్యక్తి తాను పెంచుకున్న గోమాత లేగ దూడకు జన్మనివ్వగా.. ఊరందరినీ పిలిచి ఆ లేగ దూడకు బారసాల చేశాడు. అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు.. ఆ లేగ దూడకు నామకరణం కూడా చేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకెళితే.. అబ్బాపూర్ గ్రామానికి చెందిన గాలిబ్.. ఇంట్లో గోమాతను పెంచుకుంటున్నాడు. ఆ ఆవు కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉంటూ.. కుటుంబంలో ఒకరుగానే మెలుగుతోంది. ఈ నేపథ్యంలోనే 21 రోజుల క్రితం ఆ ఆవు లేగదూడకు జన్మనిచ్చింది. ఇంకేముందు.. గాలిబ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గ్రామస్తుల సమక్షంలో, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య బారసాల నిర్వహించారు. కుటుంబ సభ్యులు వారి ఇంట్లో పుట్టిన పిల్లలకు బారసాల ఎలా నిర్వహిస్తారో అదేవిధంగా గాలిబ్ తన లేగదూడను తన కుటుంబ సభ్యులుగా భావించి పురుడు చేశాడు. లేగదూడతో పాటు గోమాతను పూజించారు. గోమాతలో సమస్త దేవతలు కొలువుదీరి ఉంటారని, అందుకే గోమాత తో పాటు గోమాతకు పుట్టిన లేగదూడ కూడా బారసాల నిర్వహించినట్లు గాలిబ్ పేర్కొన్నారు. గోమాతకు బారసాల నిర్వహిస్తే గ్రామస్తులందరూ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదిలాఉంటే.. ఈ వేడుకలో భాగంగా లేగదూడకు నూతన వస్త్రాన్ని కప్పి.. ఊయలలో వేసి.. ఊయల ఊపుతు జోల పాటలు పాడారు. మహిళలు.. మంగళహారతులు ఇచ్చారు. కాగా, ఈ వేడుకలో భాగంగా గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

Also read:

Kakarla Subbarao: నిమ్స్ ని కార్పొరేట్ ఆస్పత్రికి ధీటుగా నిలిపిన ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు మృతి

మామిడి పండ్లు సహజంగా పండినవా..! కృత్రిమంగా పండించారా..! ఎలా గుర్తించాలో తెలుసుకోండి..?