Smita Sabharwal: కష్టపడి పైకి ఎదిగినా.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్..

సమంత-నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో మొదలైన రచ్చ.. చల్లారడం లేదు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన కొండా సురేఖ..ఈ వ్యవహారంలో సమంతకు క్షమాపణలు చెప్పారు. సమంతకు కొండా సురేఖ సారీ చెప్పినా నిరసనలు ఆగడం లేదు. అక్కినేని కుటుంబానికి సపోర్ట్‌గా సెలబ్రిటీల వరుస ట్వీట్‌లు చేస్తున్నారు.

Smita Sabharwal: కష్టపడి పైకి ఎదిగినా.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్..
Smita Sabharwal - Konda Surekha
Follow us

|

Updated on: Oct 03, 2024 | 4:51 PM

సమంత-నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో మొదలైన రచ్చ.. చల్లారడం లేదు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన కొండా సురేఖ..ఈ వ్యవహారంలో సమంతకు క్షమాపణలు చెప్పారు. సమంతకు కొండా సురేఖ సారీ చెప్పినా నిరసనలు ఆగడం లేదు. అక్కినేని కుటుంబానికి సపోర్ట్‌గా సెలబ్రిటీల వరుస ట్వీట్‌లు చేస్తున్నారు. అయితే మంత్రి సురేఖకు లీగల్‌ నోటీసులు పంపుతామన్నారు అక్కినేని నాగార్జున. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దని చెబుతోంది మూవీ అసోసియేషన్‌. బాధపెట్టాలని చూస్తే మౌనంగా ఉండబోమంటూ లేఖల ద్వారా చెబుతున్నారు సెలబ్రిటీలు..కాగా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని దిగ్భ్రాంతికి గురయ్యానంటూ గురువారం స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.

స్మితా సబర్వాల్ ఏమన్నారంటే..

సమాజంలో మహిళలను .. క్లిక్‌ బైట్‌లుగా వాడుతున్నారు.. సంచలనాల కోసం థంబ్‌నెయిల్‌లుగా, ప్రధాన ఆకర్షణకు మాత్రమే ఉపయోగిస్తారు. అధికారులను కూడా వదిలిపెట్టరు.. నేను వ్యక్తిగత అనుభవం ద్వారా చెబుతున్నాను.. కష్టపడి పైకి ఎదిగినా.. తక్కువ అంచనా వేస్తారు.. అపవాదులను మూటగడతారు.. మహిళలను, కుటుంబాలను, సామాజిక నిబంధనలను గౌరవిద్దాం.. గౌరవించుకుందాం.. మంత్రిగా ఉన్న కొండా సురేఖ వ్యాఖ్యలు చూసి షాక్ అయ్యాను. అంతా రాజకీయాల కోసం కాదు.. ప్రజా జీవితంలో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకుందాం… అంటూ స్మితా సబర్వాల్ ట్విట్ చేశారు.

నటీనటులు సమంత రూత్ ప్రభు, నాగ చైతన్యల విడాకులకు కేటీఆర్ కారణం అంటూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. ఈ క్రమంలో సురేఖ వ్యాఖ్యలపై స్పందించింది మహిళా కమిషన్. సారీ చెప్పారు కాబట్టి కమిషన్‌ జోక్యం అవసరం లేదని ప్రకటన చేసింది. వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని చెబుతున్నారు PCC చీఫ్‌. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్న మహేష్‌గౌడ్..మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..