Nagarjuna: కొండా సురేఖపై పరువునష్టం దావా వేసిన నాగార్జున.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లారు అక్కినేని నాగార్జున. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.

Nagarjuna: కొండా సురేఖపై పరువునష్టం దావా వేసిన నాగార్జున.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్..
Nagarjuna, Konda Surekha
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 03, 2024 | 5:52 PM

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లారు అక్కినేని నాగార్జున. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, నాగచైతన్య, సమంత వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొండ సురేఖపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. తమ రాజకీయాల కోసం సినీ తారలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానేయ్యాలంటూ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాగార్జున.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. “ఏం జరిగిందో దాని గురించి, నేటి రాజకీయాలు, రాజకీయ నాయకులు, వారి ప్రవర్తనపై నా ఆలోచచనలు, భావాలను మంచి భాషలో వ్యక్తీకరించేందుకు కష్టపడుతున్నాను. కొందరు రాజకీయ నాయకులకు నేను ఒకటి గుర్తు చేయాలని అనుకుంటున్నాను. మనల్ని చూసుకునేందుకు మాత్రమే వారికి ఓటు వేస్తున్నాం. మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల గురించి మాట్లాడాటానికి, ఉద్యోగాలు, శ్రేయస్సును తీసుకురావడానికి, ఆరోగ్యం, విద్య, సౌకర్యాలను మెరుగుపరచడం మొదలైన వాటి కోసం ఓట్లు వేస్తున్నాం. కానీ ఇలాంటి మాటల కోసం కాదు. ఇక ఈ దిగజారుడు రాజకీయాలు చాలు” అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.