AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

smita sabharwal: స్మిత సబర్వాల్‌ వ్యాఖ్యలపై మండిపడుతోన్న నెటిజన్లు.. ఇంతకీ ఆమె ఎమన్నారంటే..

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎవరైనా వారి అభిప్రాయాలను నిస్సందేహాంగా పంచుకుంటుకున్నారు. అయితే ఇదే క్రమంలో సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న కొందరు వ్యక్తులు చేస్తున్న కామెంట్స్‌ నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఐఏఎస్‌ ఆఫీసర్‌ స్మితా సభర్వాల్ చేసిన ఓ పోస్ట్‌ తీవ్ర చర్చకు దారి తీసింది. స్మితా సభర్వాల్‌ తన ఎక్స్‌ అకౌంట్‌లో చేసిన ఓ పోస్ట్‌పై...

smita sabharwal: స్మిత సబర్వాల్‌ వ్యాఖ్యలపై మండిపడుతోన్న నెటిజన్లు.. ఇంతకీ ఆమె ఎమన్నారంటే..
Smita Sabharwal
Narender Vaitla
|

Updated on: Jul 22, 2024 | 8:05 AM

Share

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎవరైనా వారి అభిప్రాయాలను నిస్సందేహాంగా పంచుకుంటుకున్నారు. అయితే ఇదే క్రమంలో సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న కొందరు వ్యక్తులు చేస్తున్న కామెంట్స్‌ నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఐఏఎస్‌ ఆఫీసర్‌ స్మితా సభర్వాల్ చేసిన ఓ పోస్ట్‌ తీవ్ర చర్చకు దారి తీసింది. స్మితా సభర్వాల్‌ తన ఎక్స్‌ అకౌంట్‌లో చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇంతతీ స్మితాకు అంత వ్యతిరేకత ఎందుకు ఎదురవుతోంది.? ఆమె చేసిన ఓ పోస్ట్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఇటీవల ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించి, మోసానికి పాల్పడటంపై కేసు నమోదైంది. దీంతో ఆమెపై కఠిన చర్యలకు యూపీఎస్సీ ఉపక్రమించింది. ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వం రద్దుతో పాటు భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్‌ చేసేందుకు రంగం సిద్ధం చేసేలా షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో స్మితా సబర్వాల్‌ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. యూపీఎస్సీ చర్చ విస్తృతమవుతోన్న నేపథ్యంలో తాను దివ్యాంగులను గౌరవిస్తున్నాను అంటూనే కొన్ని వ్యాఖ్యలు చేశారు.

విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటా ఎందుకవసరం? నేను కేవలం అడుగుతున్నాను అంటూ రాసుకొచ్చారు.

దీంతో స్మితా సభర్వాల్ వ్యాఖ్యాలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక సుప్రీం కోర్ట్‌ సీనియర్‌ అడ్డకేట్ కరుణ స్పందిస్తూ.. ‘వైకల్యం అనేది శక్తి, మేధస్సుపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఈ పోస్టు చూస్తోంటే వైవిధ్యం, జ్ఞానోదయం చాలా అవసరమని తెలుస్తోంది’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఎంపీ ప్రియాంకా చతుర్వేది స్పందిస్తూ.. ‘బ్యూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలు, ప్రత్యేక అధికారాలు ఎలా చూపిస్తున్నారో ఈ పోస్ట్ చూస్తే అర్థమవుతోంది’ అని అన్నారు. ఇక స్మితా సభర్వాల్‌ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదికతో పాటు పలు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..