Watch Video: బాత్ రూంలో అనుమానాస్పద మృతి.. రంగంలోకి క్లూస్ టీం..
సనత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ సనత్‌నగర్ జెక్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన వెంకటేష్, మాధవి, హరి బాత్‌రూమ్‌లో విగతజీవులుగా పడి ఉన్నారు. ఓ అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో ఈ ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చినప్పుడు ఎవరూ కనిపించలేదు. బాత్‌రూమ్‌లో ఉన్నారేమోనని.. ఇంట్లో పనిచేసి వెళ్లిపోయింది.
సనత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ సనత్‌నగర్ జెక్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన వెంకటేష్, మాధవి, హరి బాత్‌రూమ్‌లో విగతజీవులుగా పడి ఉన్నారు. ఓ అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో ఈ ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చినప్పుడు ఎవరూ కనిపించలేదు. బాత్‌రూమ్‌లో ఉన్నారేమోనని.. ఇంట్లో పనిచేసి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 3గంటల సమయంలో వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఎవరూ కనిపించలేదు. బాత్‌రూమ్ డోర్‌లాక్ అలాగే ఉండటంతో అనుమానం వచ్చి అపార్ట్‌మెంట్ నిర్వాహకులకు చెప్పింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డోర్ పగులగొట్టి చూడగా..ఆర్.వెంకటేష్(55), మాధవి(50), హరి(30) విగతజీవులుగా పడి ఉన్నారు. తొలుత విద్యుదాఘాతంతో మృతి చెందినట్టు భావించినప్పటికీ.. అలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

