Watch Video: వెండి ఆభరణాలకు మెరుగుపెట్టి.. ఆ పనిచేస్తూ దొరికిపోయిన మోసగాళ్లు..
కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంటలో ఘరానా మోసం చోటు చేసుకుంది. వెండి ఆభరణాలకు పాలిష్ చేస్తామని మాయ మాటలు చెప్పి అందులోని వెండిని కరిగించి దోచేశారు. వస్తువు చూసేందుకు అలాగే కనిపించినా.. తూకంలో తేడాలు గమనించారు స్థానికులు. ఇలాంటి ఘటనకు పాల్పడిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు గ్రామస్తులు. చాకచక్యంగా చేసిన మోసాన్ని గ్రహించి నిందితుల కాళ్లు, చేతులు కట్టేసి దేహాశుద్ది చేశారు.
కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంటలో ఘరానా మోసం చోటు చేసుకుంది. వెండి ఆభరణాలకు పాలిష్ చేస్తామని మాయ మాటలు చెప్పి అందులోని వెండిని కరిగించి దోచేశారు. వస్తువు చూసేందుకు అలాగే కనిపించినా.. తూకంలో తేడాలు గమనించారు స్థానికులు. ఇలాంటి ఘటనకు పాల్పడిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు గ్రామస్తులు. చాకచక్యంగా చేసిన మోసాన్ని గ్రహించి నిందితుల కాళ్లు, చేతులు కట్టేసి దేహాశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ముగ్గురు మోసగాళ్ళును అదుపులోకి తీసుకుని కేసు నోమోదు చేశారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన నిందితుల్లో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుల ద్వారా మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామన్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న వారిని ప్రస్తుతం విచారాస్తున్నట్లు తెలుపారు. ఇలాంటి మోసాలు అనేక ప్రాంతాల్లో తరచూ చోటు చేసుకుంటూనే ఉంటాయని, ఇలాంటా వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని బాధితులతో పాటూ గ్రామస్తులకు సూచించారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

