ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలం శినకొత్తపల్లిలో 600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం బయటపడింది. రైతు వీరనారాయణకు పొలంలో లభించిన ఈ విగ్రహం విజయనగర రాజుల కాలం నాటిదని పురావస్తు నిపుణులు నిర్ధారించారు. కుడి వైపు తొండంతో ఉండటం దీని ప్రత్యేకత. స్థానికులు పూజలు నిర్వహించి, ఆలయం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.