పార్లమెంట్ సమావేశాల వేళ మళ్లీ తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా

రక్షణమంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు వైసీపీ ఎంపీలు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆర్జేడీ, జేడీయూ అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేయగా.. వైసీపీ ఎంపీలు.. ఏపీకి కూడా స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలని కోరారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీని నిలుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్ సమావేశాల వేళ మళ్లీ తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా

|

Updated on: Jul 21, 2024 | 8:43 PM

రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు వైసీపీ ఎంపీలు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆర్జేడీ, జేడీయూ అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేయగా.. వైసీపీ ఎంపీలు.. ఏపీకి కూడా స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలని కోరారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీని నిలుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమంలోనే.. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై మళ్లీ రాజకీయ మంటలు రగులుతున్నాయి. ఢిల్లీ వేదికగా టీడీపీ, వైసీపీ మధ్య స్పెషల్‌ స్టేటస్‌ ఫైట్‌ నడుస్తోంది. ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ.. ప్రత్యేక హోదాపై మాట్లడడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే.. తమ ముందు చాలా అంశాలు ఉన్నాయని.. వాటన్నింటిపైనా పార్లమెంట్‌లో మాట్లాడతామంటూ టీడీపీ కౌంటర్‌ ఇవ్వడం కాకరేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow us