AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bilkis Bano Case: మాకు మాట్లాడే హక్కుంది.. బిల్కిస్ కేసు పై స్మితా సభర్వాల్ వరుస ట్వీట్లు.. రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ..

Smita Sabharwal: గుజరాత్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార టీఆర్‌ఎస్ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తరుణంలో తాజాగా తెలంగాణకు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం..

Bilkis Bano Case: మాకు మాట్లాడే హక్కుంది.. బిల్కిస్ కేసు పై స్మితా సభర్వాల్ వరుస ట్వీట్లు.. రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ..
Smita Sabharwal
Sanjay Kasula
|

Updated on: Aug 19, 2022 | 12:12 PM

Share

గుజరాత్‌ బిల్కిస్​ బానో అత్యాచార దోషుల్ని(Bilkis Bano Case) విడుదల చేయటంపై  దేశవ్యాప్తంగా నిరసనల వ్యక్తమవుతున్నాయి. బిల్కిస్​ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార టీఆర్‌ఎస్ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తరుణంలో తాజాగా తెలంగాణకు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్(Smita Sabharwal) కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఐఏఎస్ అధికారిణిగా సర్వీసులో ఉన్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో..  ఆమె చేసిన ట్వీట్ అధికార, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బిల్కిస్ వివాదం పై నిన్నటి ట్వీట్ కు కొనసాగింపుగా శుక్రవారం మరో ట్వీట్ చేశారు స్మితా సభర్వాల్. సివిల్ సర్వీసెస్ లో ఉన్నా కూడా మాకు మాట్లాడే హక్కు ఉందంటూ స్మితా పేర్కొనడం కొత్త చర్చకు దారితీస్తోంది.

రేపిస్టులను జైలు నుంచి విడిచి పెట్టడం పెట్టడంపై తనకు నమ్మకం కలగడం లేదంటూ వరుస ట్వీట్లు చేశారు. ఒక మహిళగా, సివిల్ సర్వెంట్‌గా తాను ఈ న్యూస్ చూసిన ఆందోళన చెందానంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

స్వేచ్ఛాయుత దేశంలో ఉన్నాననే నమ్మకం తనకు కలగట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా.. స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే బిల్కిస్ బానో హక్కును మనం మళ్లీ తుడిచిపెట్టినట్టయిందని ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

బిల్కిస్ బానో ఆవేదనను ప్రతిబింబించేలా.. ఈ పరిణామం బిల్కిస్ బానో స్వేచ్ఛను హరించినట్టయిందని కామెంట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేమని స్మిత సబర్వాల్ పేర్కొన్నారు. బిల్కిస్ బానో తరఫు న్యాయవాది శోభ విడుదల చేసిన ఓ ప్రెస్‌నోట్‌ను తన ట్వీట్‌తోపాటు జత చేశారు.

20 సంవత్సరాలుగా బిల్కిస్ బానో అనుభవిస్తోన్న గాయాల బాధ మరోసారి చెలరేగిందని బిల్కిస్ బానో చెప్పారు. తన జీవితాన్ని, కుటుంబాన్ని ఛిద్రం చేసిన 11 మంది దోషులు జైలు నుంచి విముక్తులు అయ్యారని తెలిసి, మాటలు రావట్లేదని రాసుకొచ్చారు. మూడేళ్ల కుమార్తెను దూరం చేసిన వారందరూ సమాజంలో అడుగు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా జీవించగలనా..? దేశ చట్టాలు, న్యాయస్థానాలు, వ్యవస్థల మీద తనకు అపారమైన నమ్మకం ఉండేదని.. వారిని స్వేచ్ఛా సమాజంలోకి విడిచి పెట్టిన తరువాత తానెలా ధైర్యంతో జీవించ గలుగుతానని బిల్కిస్ బానో ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ 11 మందిని విడిచిపెట్టడానికి ముందు.. వారి వల్ల నష్టపోయిన తన అభిప్రాయాన్ని, భద్రతను ఎవరూ అడగలేదని పేర్కొన్నారు. తాను స్వేచ్ఛగా ఈ సమాజంలో జీవించే హక్కును కల్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని బిల్కిస్ బానో కోరారు.

మరిన్ని తెలంగాణ, జాతీయ వార్తల కోసం