HYDRA: హైడ్రా అంటే భయం కాదు.. భవిష్యత్తుకు భరోసా.. స్పష్టం చేసిన కమిషనర్ రంగనాథ్

ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఎక్కడ పేదలు నివసిస్తున్న ఇళ్లను కూల్చడం లేదని క్లారిటీ ఇచ్చారు.

HYDRA: హైడ్రా అంటే భయం కాదు.. భవిష్యత్తుకు భరోసా.. స్పష్టం చేసిన కమిషనర్ రంగనాథ్
Dana Kishore Ev Ranganath
Follow us

|

Updated on: Sep 28, 2024 | 6:32 PM

ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఎక్కడ పేదలు నివసిస్తున్న ఇళ్లను కూల్చడం లేదని క్లారిటీ ఇచ్చారు. చెరువులను అక్రమంగా కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువగా సోషల్ మీడియానే హైడ్రాను ఎక్కువగా బూచిగా ప్రచారం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అమీన్ పూర్ లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న హైడ్రా కమిషనర్, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న ధీమాతో కొందరు బడా వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారున్నారు. N కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కనే ఉన్న గుడిసెలను తొలగించలేదన్నారు. కొందరు అక్రమ వ్యాపారాలు చేస్తూ… హైడ్రా వచ్చినప్పుడు కిరోసిన్, పెట్రోల్ తో ఆందోళన చేస్తున్నారన్నారు. కూకట్ పల్లి చెరువు దగ్గర ఉన్నవారికి ముందస్తు సమాచారం ఇచ్చామని రంగనాథ్ వెల్లడించారు. కొందరు సీరియస్‌గా తీసుకోలేదని, వారిని ఖాళీ చేయించిన తరువాతనే కూల్చివేతలు స్టార్ట్ చేశామన్నారు.

హైడ్రా అనేది ఒక బూచిగా చూపించి బుచ్చమ్మను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. హైడ్రా అంటే భరోసా.. అయితే కొందరు హైడ్రాను బూచిగా చూపిస్తున్నారు అది సరైంది కాదన్నారు. పేద వాళ్ళను ఇబ్బందులు గురిచేసేందుకు హైడ్రా ఉండదన్నారు. ఇప్పటి వరకు హైడ్రా కూల్చిందీ ఖాళీగా ఉన్న భవనాలు మాత్రమే అన్నారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒవైసీ కాలేజీలు బఫర్ జోన్ లో ఉన్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. పిల్లల అకడమిక్ ఇయర్ నష్టం జరుగుతుందని ఆలోచన చేస్తున్నామన్నారు. అంతే తప్పా, అక్రమ కట్టడాలు ఎవరివైనా కూల్చివేస్తామన్నారు. పేదల పట్ల ఒకలా, పెద్దోళ్ల పట్ల మరోలా హైడ్రా వ్యవహరించదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్రమంగా నిర్మించిన పెద్ద వాళ్ళే ప్రథమ టార్గెట్ గా హైడ్రా కూల్చివేతలు చేస్తుందన్నారు. హైడ్రా సైలెంట్ గా ఏమి లేదని.. హైడ్రా తన పని తానూ చేసుకుంటూ పోతుందన్నారు..

మూసీ నిర్వాసితులకు ఉపాధితో పాటు రూ.30లక్షల విలువైన డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని మూసీ రీ డెవలప్‌మెంట్ ఎం.డీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి అధికారులు వెళుతున్నారని, ప్రతీ విషయం వివరిస్తున్నారని తెలిపారు. చట్టానికి లోబడే హైడ్రా అధికారులు పనిచేస్తున్నారని, మూసీ నిర్వాసితులను బలవంతంగా తరలించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురైన మూసీని విస్తరింపజేయాలన్న ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తున్నామని దాన కిశోర్ తెలిపారు.

మూసీపై ముఖ్య పత్రికల్లో వార్తలు రావడం ఆందోళన కలిగించిందని దాన కిశోర్ అన్నారు. నిజాం హయంలో భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో ఎంత ఇబ్బంది అయిందో అందరికి తెలుసు. 5 యేండ్ల నుండి తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదల నుంచి హైదరాబాద్ ప్రజలను కాపాడుకునేందుకే మూసీ రీ డెవలప్‌మెంట్ చేపట్టిన దాన కిశోర్ స్పష్టం చేశారు.

మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్, వెస్ట్ కారిడార్ నిర్మిస్తామని.. 55 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్, వెస్ట్ కారిడార్లు నిర్మిస్తామని దానకిషోర్ తెలిపారు. దీనివల్ల హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులు నిర్మిస్తామని ఆయన తెలిపారు. మూసీ ప్రక్షాళన అనేది సుందరీకరణ కోసం చేస్తున్న పనులు కాదనే విషయం అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. మూసీ ప్రక్షాళనపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ టూర్ లో మూసీ పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లు ఉంటారని దాన కిశోర్ తెలిపారు.

ఇప్పటి వరకు మూసీ పరివాహక ప్రాంతంలో 50 కుటుంబాలు తమ ఇష్టంగా షిఫ్ట్ అయ్యారు. మరో 200 కుటుంబాలు షిఫ్ట్ అయ్యేందుకు ముందుకు వచ్చారు. బఫర్ జోన్ లో ఉండి పట్టా భూమి ఉంటే తప్పకుండా డబుల్ పేమెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నదన్నారు. పారదర్శకంగా మాత్రమే వారిని షిఫ్ట్ చేస్తున్నామని, బలవంతగా పంపించడం లేదని దాన కిశోర్ స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆ రాశుల వారికి అధికార, గృహ, ఉద్యోగ యోగాలు
ఆ రాశుల వారికి అధికార, గృహ, ఉద్యోగ యోగాలు
లక్ష్యం ఒక్కటే.. కబ్జా చేస్తే ఊరుకునేదీ లేదుః రంగనాథ్
లక్ష్యం ఒక్కటే.. కబ్జా చేస్తే ఊరుకునేదీ లేదుః రంగనాథ్
బిగ్ బాస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇక ఆ ఇద్దరు బయటికే!
బిగ్ బాస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇక ఆ ఇద్దరు బయటికే!
బెస్ట్ ఆఫీస్ చైర్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 67శాతం వరకూ తగ్గింపు..
బెస్ట్ ఆఫీస్ చైర్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 67శాతం వరకూ తగ్గింపు..
హైదరాబాద్ హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభం
హైదరాబాద్ హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభం
మహేష్ బాబు మావయ్య ఓ క్రికెటర్.. సునీల్ గవాస్కర్‌తో ఆడారు..
మహేష్ బాబు మావయ్య ఓ క్రికెటర్.. సునీల్ గవాస్కర్‌తో ఆడారు..
బిస్కెట్లు ఎలా తయారుచేస్తారో చూస్తే షాక్ అవుతారు!
బిస్కెట్లు ఎలా తయారుచేస్తారో చూస్తే షాక్ అవుతారు!
విదేశాల్లో తొలి రక్షణ రంగ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోన్న టాటాసంస్థ..
విదేశాల్లో తొలి రక్షణ రంగ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోన్న టాటాసంస్థ..
భారీగా పెరుగుతున్న బంగారం ధర.. దీపావళికి రికార్డ్‌ సృష్టించనుందా?
భారీగా పెరుగుతున్న బంగారం ధర.. దీపావళికి రికార్డ్‌ సృష్టించనుందా?
నేటి యువత ఎందుకు గుండెపోటుకు గురవుతున్నారు? నిపుణుల సలహా ఏమిటంటే
నేటి యువత ఎందుకు గుండెపోటుకు గురవుతున్నారు? నిపుణుల సలహా ఏమిటంటే