AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila : మైనారిటీలతో లోటస్ పాండ్ లో షర్మిల సమ్మేళనం, తెలంగాణలో ముస్లింల పరిస్థితి ఇలా ఉందంటూ వ్యాఖ్యలు

YS Sharmila : తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్న వైఎస్‌ షర్మిల అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అందరితో తన ఆలోచన..

YS Sharmila : మైనారిటీలతో లోటస్ పాండ్ లో  షర్మిల సమ్మేళనం, తెలంగాణలో ముస్లింల పరిస్థితి ఇలా ఉందంటూ వ్యాఖ్యలు
Ys Sharmila
Venkata Narayana
|

Updated on: Mar 22, 2021 | 9:52 PM

Share

YS Sharmila : తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్న వైఎస్‌ షర్మిల అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అందరితో తన ఆలోచన పంచుకుంటున్నారు. దీంతో వరుస ఆత్మీయ సమ్మేళనాలతో సందడిగా కనిపిస్తోంది హైదబాద్ బంజారాహిల్స్ లోని లోటస్‌పాండ్‌. ఇలాఉంటే, జెండా..ఎజెండా తర్వాత. ముందు అందరి మద్దతు కూడగట్టుకోవాలి. అప్పుడే పార్టీ ఆవిర్భావం అనుకున్న స్థాయిలో ఉంటుందన్న ఆలోచనతో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ తనయ షర్మిల. అందుకే రాజకీయపార్టీ పెట్టబోతున్నానని ప్రకటించినప్పటినుంచీ అన్ని వర్గాలతో సమావేశమవుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు…ఇతర పార్టీల నేతలు, తటస్థంగా ఉన్నవారు లోటస్‌పాండ్‌కు వచ్చి వైఎస్‌ షర్మిలతో భేటీ అవుతున్నారు.

ముస్లిం మైనారిటీలతో ఆత్మీయ సమ్మేళనంలో ముస్లిం వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు షర్మిల. ముస్లింలు లేని తెలంగాణను ఊహించలేమన్న షర్మిల.. తెలంగాణలో వారి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గంగ జమున తహెజీబ్ అంటూ పాలకులు మాటలకే పరిమితమయ్యారని, ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్‌గానే చూస్తున్నారని షర్మిల విమర్శించారు. 12 శాతం రిజర్వేషన్లంటూ ముస్లింలకు ఇచ్చిన హామీని టీఆర్‌ఎస్‌ నిలబెట్టుకోలేదన్నారు షర్మిల. రిజర్వేషన్లు ఇవ్వకుండా ముస్లింలను కేసీఆర్‌ మోసగించారన్నారు.

57వేల ఎకరాల వక్ఫ్‌భూములు అన్యాక్రాంతమయ్యాయన్న షర్మిల.. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాతబస్తీలో కొత్తగా ఏదైనా అభివృద్ధి జరుగుతోందా అని ప్రశ్నించారు. ముస్లింల సమస్యపై పోరాడతానని ప్రకటించారు. వ్యూహాత్మకంగా అన్ని వర్గాలతో సమావేశమతున్నారు షర్మిల. విస్తృతస్థాయిలో సమావేశాల తర్వాతే పార్టీపై కీలక ప్రకటన చేయబోతున్నారు.

Read also : Nagarjuna Sagar By Elections : సాగర్ లో కాంగ్రెస్ దూకుడు.. 27న జనగర్జన సభ, గులాబీ, కమలం అభ్యర్థులు వాళ్లేనా.?