Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ అప్డేట్ ఇదే.. హోంమంత్రి, హెల్త్ డైరెక్టర్ ఏమన్నారంటే..?

Lockdown in Telangana: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. వారం నుంచి అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్ని నెలల తరువాత రెండు రోజుల నుంచి వేలాది కేసులు పెరుగుతుండటంతో

Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ అప్డేట్ ఇదే.. హోంమంత్రి, హెల్త్ డైరెక్టర్ ఏమన్నారంటే..?
Lockdown in Telangana
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 22, 2021 | 4:52 PM

Lockdown in Telangana: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. వారం నుంచి అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్ని నెలల తరువాత ఒక్కసారిగా వేలాది కేసులు పెరుగుతుండటంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించడంతోపాటు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో కూడా కూడా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధిస్తారని రెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దీనిపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు స్పందించారు.

తెలంగాణలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ విధించే యోచన ప్రస్తుతానికి లేదని వారు స్పష్టంచేశారు. లాక్‌డౌన్ చాలామంది జీవితాలపై చెడు ప్రభావం చూపుతుందని అలాంటి ఆలోచనే లేదని హోంమంత్రి అలీ సోమవారం ప్రకటించారు. కాగా విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని.. దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్కూళ్లల్లో కేసుల సంఖ్య పెరగుతుందని.. విద్యార్థుల ద్వారా ఇంట్లోని వారికి కరోనా సోకే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. పాజిటివ్‌ కేసుల పెరుగుదలను బట్టి కోవిడ్ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైందని భావిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా నియంత్రణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. అర్హులందరూ టీకా వేయించుకోవాలని కోరారు. వ్యాక్సినేషన్‌ పెరిగితే వైరస్‌ నియంత్రణలోకి వస్తుందని వెల్లడించారు. ప్రజల అప్రమత్తతోనే కరోనా నియంత్రణ సాధ్యమని, వైరస్ కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

Also Read:

#JanataCurfew: జనతా కర్ఫ్యూకు ఏడాది.. సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు, ఫోటోలు ఇలా వైరల్ అవుతాయి..ఓ సారి చూద్దాం..

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?