జస్టిస్ సుభాషణ్ రెడ్డికి జగన్ నివాళులు!
హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతూ ఈ ఉదయం స్వర్గస్తులయ్యారు. అనారోగ్యంతో మృతిచెందిన జస్టిస్ సుభాషణ్ రెడ్డి భౌతికకాయానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి జగన్ సానుభూతి తెలిపారు. బషీర్‌బాగ్‌లోని అవంతినగర్‌లో సుభాషణ్ రెడ్డి నివాసానికి జగన్ బుధవారం వెళ్లారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ దంపతులు, అసదుద్దీన్ ఒవైసీ, పలువురు నేతలు […]
హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతూ ఈ ఉదయం స్వర్గస్తులయ్యారు. అనారోగ్యంతో మృతిచెందిన జస్టిస్ సుభాషణ్ రెడ్డి భౌతికకాయానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి జగన్ సానుభూతి తెలిపారు. బషీర్‌బాగ్‌లోని అవంతినగర్‌లో సుభాషణ్ రెడ్డి నివాసానికి జగన్ బుధవారం వెళ్లారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ దంపతులు, అసదుద్దీన్ ఒవైసీ, పలువురు నేతలు జస్టిస్ సుభాషణ్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.