జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి..తెలుగు రాష్ట్రాల సిఎంల సంతాపం
హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుభాషణ్ రెడ్డి.. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు చేశారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సుభాషన్ […]
హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుభాషణ్ రెడ్డి.. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు చేశారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సుభాషన్ రెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాగా గతంలో ఆయన లోకాయుక్త చైర్మన్‌గా పనిచేశారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డికి ముగ్గురు కుమారులు.
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. సుభాషణ్ రెడ్డి మృతి న్యాయరంగానికి తీరనిలోటు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు తొలి చైర్మన్‌గా జస్టిస్ సుభాషణ్ రెడ్డి చేసిన సేవలు ఎనలేనివి.
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2019
జస్టిస్ శ్రీ సుభాషణ్ రెడ్డి మృతిపట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ శ్రీ ఎస్కే జోషిను సీఎం ఆదేశించారు.
— Telangana CMO (@TelanganaCMO) May 1, 2019