Hyderabad: సైబర్‌ మోసాలపై చిన్నారుల్లో అవగాహన పెంచేందుకు.. తెలంగాణ పోలీసుల వినూత్న కార్యక్రమం..

Hyderabad: మారుతోన్న కాలంతో పాటు మోసాలు, నేరాలు కూడా మారుతున్నాయి. పెరిగిన టెక్నాలజీతో పాటు మోసాలు కూడా కొంత రూపాన్ని సంతరించుకున్నాయి. సైబర్‌ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ నేరాలపై...

Hyderabad: సైబర్‌ మోసాలపై చిన్నారుల్లో అవగాహన పెంచేందుకు.. తెలంగాణ పోలీసుల వినూత్న కార్యక్రమం..
She Teams Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 04, 2021 | 9:09 AM

Hyderabad: మారుతోన్న కాలంతో పాటు మోసాలు, నేరాలు కూడా మారుతున్నాయి. పెరిగిన టెక్నాలజీతో పాటు మోసాలు కూడా కొంత రూపాన్ని సంతరించుకున్నాయి. సైబర్‌ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ నేరాలపై సరైన అవగాహన లేకచాలా మంది బాధితులుగా మారుతున్నారు. ముఖ్యంగా బాలబాలికలు సైబర్‌ మోసగాళ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రకమైన మోసాలను అరికడుతూ.. సైబర్‌ నేరాలపై చిన్నారుల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యంగిస్తాన్ అనే ఎన్జీవో సహాయంతో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు శ్రీకారం చుట్టారు.

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో, మరీ ముక్యంగా టీనేజీ పిల్లల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. టెక్నాలజీ తప్పనిసరి అంటూ తల్లిండ్రులు సైతం పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు. దీంతో పిల్లలు పక్కదారి పడుతున్నట్లు కేంద్రం హోం శాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ విభాగం గుర్తించింది. స్మార్ట్ ఫోన్లు వాడుతున్న 10 నుంచి 16 ఏళ్ల పిల్లలు పోర్న్ సైట్లు, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది ఆందోళనకర పరిణామమని పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లోని పోలీస్ శాఖలు సైబర్ నేరాల నియంత్రణపై తప్పనిసరిగా టీనేజీ విద్యార్థులకు అవగాహన కల్పించాలని కేంద్రం ఆదేశించింది. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ పోలీసులు గత 4 నెలల నుండి సైబర్ కాంగ్రెస్ పేరుతో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు..

స్మార్ట్ ఫోన్స్-సైబర్ నేరాలపై ప్రత్యేకంగా 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేసి క్లాసులు నిర్వహిస్తున్నారు. నెట్టింట వేలకొద్ది యాప్స్ అందుబాటులోకి రావడంతో టీనేజ్ విద్యార్థులు ఏది పడితే ఆ యాప్‌ను వినియోగించకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చైతన్యం కల్పిస్తున్నారు. ఆ యాప్స్‌తో లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుందని ప్రాక్టికల్‌గా చెబుతున్నారు. తెలంగాణ షీటీమ్స్‌, మహిళా భద్రత విభాగం, సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సైబర్‌ కాంగ్రెస్‌ పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనికి యంగిస్థాన్‌ స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తోంది. ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్న సమయంలో పిల్లలను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. వారిని వివిధ మార్గాల్లో బెదిరించి డబ్బులు తీసుకోవడమో.. ఇతరత్రా చర్యలకు దిగుతున్నారు. సైబర్‌ నేరాల తీరు.. జాగ్రత్తలు, సైబర్‌ నేరగాళ్లపై ఎలా ఫిర్యాదు చేయాలో వివరిస్తున్నారు. పదినెలల పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో శిక్షణ ఇస్తున్నారు.

పోలీసు శాఖ నుంచి రాష్ట్ర మహిళా విభాగం భద్రత అధికారి అడిషనల్ డీజీ స్వాతిలక్రా, డి ఐ జి సుమతి.. విద్యాశాఖ నుంచి సమగ్ర శిక్ష సమన్వయకర్త రమేశ్‌ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. సైబర్‌ కాంగ్రెస్‌లో భాగంగా తెలంగాణలో ప్రతి జిల్లాకు 50 స్కూళ్లను సెలెక్ట్ చేశారు. 30 జిల్లాల్లో పదిహేను వందల స్కూళ్లలో ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 331షి టీమ్స్ కూడా ఇందులో బాగస్వామ్యం అయ్యాయి. ప్రతీ స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు, ఓ టీచర్ ఎంపిక చేసుకుని వారికి ఆన్ లైన్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ లోని జుబ్లీహిల్స్ ప్రభుత్వ పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థుల్ని, ఒక టీచర్ ను ఎంపిక చేశారు. వాళ్లకి వర్చువల్‌గా శిక్షణ ఇస్తున్నారు.

పి. సురేష్‌ టీవీ9 రిపోర్టర్‌, హైదరాబాద్‌.

Also Read: Akhanda : బాలయ్యకు హిట్ వస్తే.. అది ఇండస్ట్రీకి హిట్ వచ్చినట్టే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్

Bimbisara: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’కు భారీ డిమాండ్.. పోటీపడుతున్న సంస్థలు..

Minister Anil: జలప్రళయంతో రాజకీయాలు మానండి.. టీడీపీ స్క్రిప్ట్ కేంద్ర మంత్రి చదివారంటున్న మంత్రి అనిల్