AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bimbisara: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’కు భారీ డిమాండ్.. పోటీపడుతున్న సంస్థలు..

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం బింబిసారా .. ఓ వైపు హీరోగా మరోవైపు నిర్మాతగా రాణిస్తున్న కళ్యాణ్ రామ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.

Bimbisara: కళ్యాణ్ రామ్ 'బింబిసార'కు భారీ డిమాండ్.. పోటీపడుతున్న సంస్థలు..
Bimbisara
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2021 | 7:33 AM

Share

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం బింబిసారా .. ఓ వైపు హీరోగా మరోవైపు నిర్మాతగా రాణిస్తున్న కళ్యాణ్ రామ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఓ వైపు కల్మార్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు హిస్టారికల్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రానున్నారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు.ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా  రిలీజ్ చేసిన ‘బింబిసార’ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ ను రెండు పవర్ ఫుల్ పాత్రల్లో ప్రెజెంట్ చేశారు.

అయితే హిస్టారికల్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు సంస్థలు మేకర్స్ తో సంప్రదింపులు కూడా చేశారట. కానీ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ లోనే విడుదల చేస్తామని చెప్తున్నారు మేకర్స్. ‘ఎంత మంచివాడవురా’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాను భారీగా విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun: పుష్పరాజ్‏కు స్పెషల్ గిఫ్ట్ పంపిన శ్రీవల్లి.. థ్యాంక్స్ చెప్పిన బన్నీ.. ఏం పంపిందంటే..

Pooja Hegde: రాధేశ్యామ్ కోసం ప్రేరణ డబ్బింగ్ పూర్తిచేసిన పూజా హెగ్డే.. ఫోటో వైరల్..

Fact Check: రామ్ గోపాల్ వర్మ చెప్పిన ఒమిక్రాన్ సినిమా ఉందా? అసలు ఆ పోస్టర్ నిజమైనదేనా?