Telangana: గోవా నుంచి తెలంగాణకు మద్యం తెచ్చుకోవచ్చా..?
అక్రమ మద్యం స్థావరాలపై కొరడా ఝలిపిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఆబ్కారీ శాఖ ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్న మద్యాన్ని భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. గోవా, హర్యానాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి దిగుమతి చేసుకుంటున్న గోదాంలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గోవా నుంచి మద్యం హైదరాబాద్...

అక్రమ మద్యం స్థావరాలపై కొరడా ఝలిపిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఆబ్కారీ శాఖ ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్న మద్యాన్ని భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. గోవా, హర్యానాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి దిగుమతి చేసుకుంటున్న గోదాంలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గోవా నుంచి మద్యం హైదరాబాద్ దిగుమతి చేసుకొని డెన్ లు పెడ్తున్న స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల యథేచ్ఛగా అక్రమ మద్యం దిగుమతి ఆవుతుండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.
రైల్వేస్టేషన్ , బస్ స్టేషన్, ప్రైవేట్ ట్రావెల్స్‌లో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఎంత చిన్న పరిమాణం లోనైనా తీసుకురావడం నేరం అంటున్నారు ఎక్సైజ్ అధికారులు. నిబంధనలు పాటించకుండా అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టి PD Act క్రింద చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ మంత్రి అధికారులను ఆదేశించారు. గోవా, హర్యానా నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్న రాజా రాం పై పీడీ ఆక్ట్ నమోదు చేశారు ఎక్సైజ్ అధికారులు.
ఓవైపు స్పెషల్ డ్రైవ్ తో పాటు రాష్ట్రంలో ఉన్న ఫంక్షన్ హాల్స్ యజమానులు, ఈవెంట్ నిర్వాహకులు, కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులు, బ్యాంకెట్ హాల్ నిర్వాహకులు, హోటల్ నిర్వాహకులకు అక్రమ మద్యం పై సరఫరా పై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. దీంతో పాటు అంతర్ రాష్ట్ర రవాణా సర్వీసులైన కార్గో, పార్సల్ సర్వీసులు నిర్వహిస్తున్నా వారికి ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం సరఫరా కాకుండా వారికి ముందస్తు నోటీసు లు ఇస్తున్నారు.




మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..