Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. గురుకులాలు , అనుబంధ హాస్టళ్ల డైట్ ఛార్జీల పెంపు .. ఇవి పూర్తి వివరాలు..

డైట్ చార్జీల పెరుగుదల కోసం సిఎం కేసీఆర్ మంత్రుల సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కసరత్తు అనంతరం సిఎం కేసీఆర్ గారికి సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచింది.

Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. గురుకులాలు , అనుబంధ హాస్టళ్ల డైట్ ఛార్జీల పెంపు .. ఇవి పూర్తి వివరాలు..
Kcr
Follow us
Sridhar Prasad

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 22, 2023 | 9:47 PM

రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు మరోసారి మానవీయకోణంలో నిర్ణయం తీసుకున్నారు. గురుకుల హాస్టల్లలో చదువుకునే విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం వసతులను అందించేందుకు ప్రస్థుతం అందిస్తున్న డైట్ ’ చార్జీలను పెంచుతూ సంబంధిత ఫైలు మీద శనివారం నాడు సచివాలయంలోని తన ఛాంబర్ లో సిఎం కేసీఆర్ సంతకం చేశారు. పెరిగిన డైట్’ చార్జీలు జులై నెలనుండి అమలులోకి రానున్నాయి.

ఈ మేరకు పెరిగిన డైట్’ చార్జీల వివరాలు :

  • 3 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న రూ. 950 ల డైట్ చార్జీలు రూ. 1200 కు పెరిగాయి.
  • 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న డైట్’ చార్జీలు రూ.1100 నుంచి రూ.1400 లకు పెరిగాయి.
  • 11 వ తరగతి నుండి పీ.జీ దాకా చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు రూ.1500 నుంచి రూ.1875 లకు పెరిగాయి.

కాగా…డైట్ చార్జీల పెరుగుదల కోసం సిఎం కేసీఆర్ మంత్రుల సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కసరత్తు అనంతరం సిఎం కేసీఆర్ గారికి సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..