Online Fraud: పాతబస్తీలో ఆన్‌లైన్ మోసం.. షాపు యజమానిని బురీడి కొట్టించిన కిలాడీ లేడీ
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఎంచక్కా షాపింగ్ చేసి ఆన్‌లైన్ పేమెంట్ పేరుతో షాపు యజమానిని ఓ కిలాడీ లేడీ బురీడీ కొట్టించింది. సంతోష్‌నగర్‌లోని మోయిన్‌బాగ్ ప్రాంతంలోని ఓ డ్రైఫ్రూట్ షాప్‌కి వచ్చిన మహిళ సుమారు మూడు వేల..

హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఎంచక్కా షాపింగ్ చేసి ఆన్‌లైన్ పేమెంట్ పేరుతో షాపు యజమానిని ఓ కిలాడీ లేడీ బురీడీ కొట్టించింది. సంతోష్‌నగర్‌లోని మోయిన్‌బాగ్ ప్రాంతంలోని ఓ డ్రైఫ్రూట్ షాప్‌కి వచ్చిన మహిళ సుమారు మూడు వేల రూపాయల విలువైన డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేసింది. షాపు అతనికి డబ్బులు ఇవ్వకుండా ఆన్‌లైన్ పేమెంట్ చేస్తానంటూ నమ్మబలికింది. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తున్నట్టు నటించి నానా హడావుడి చేసింది. చివరికి డబ్బులు చెల్లించకుండానే ఇచ్చానంటూ షాపు ఓనర్‌ను బుకాయించింది.
పే చేస్తే మిషన్‌లో సౌండ్ రాలేదని యజమాని గొడవ పెట్టుకోవడంతో కావాలంటే తన నెంబర్ నుంచి మిస్‌కాల్ ఇస్తా చెక్ చేసుకోమంటూ మిస్‌కాల్ ఇచ్చి డ్రైఫ్రూట్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అకౌంట్‌లో చూసి డబ్బులు రాకపోయే సరికి యజమాని, మహిళ ఫోన్ నెంబర్‌తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి