Telangana: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. భారీగా పెన్షన్ పెంచిన తెలంగాణ సర్కార్
Asara Pension For Disabled: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో ఇస్తున్న పెష్ణన్‌ను వెయ్యి రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.

హైదరాబాద్, జూలై 22: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు అందించే ఆసరా పింఛను రూ.4016కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన పింఛనును వచ్చే నెల నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఈ ఆసరా పింఛను వల్ల ఐదు లక్షల మంది దివ్యాంగులు లబ్ధిపొందుతారు. దీంతోపాటు పలు అంశాలపై సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు( కేసీఆర్) భేటీ అయ్యారు. దివ్యాంగులకు ఆసరా పింఛనుతోపాటు పలు అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు.
అయితే ఇప్పటి వరకు దివ్యాంగులకు పెన్షన్ కింద రూ. వెయ్యి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇస్తున్న పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కి తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇకపై వచ్చే నెల నుంచి దివ్యాంగులు నెలకు రూ.4016 పెన్షన్‌ను అందించనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వాపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం