Hyderabad: నగరం నడిబొడ్డున మాయామశ్చింద్ర.. స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్..
మహానగరంలోని కొన్ని స్పా, వెల్‌నెస్ సెంటర్ల కథ కూడా అలానే ఉంది. పైకి మసాజ్ సెంటర్లు..లోన జరిగేది మాత్రం బ్రోతల్ దందా. పంజాగుట్ట సెంటర్‌లో ..అదీ ఠానాకు కూతవేటు దూరంలో సాగుతోన్న బ్లూ రాకెట్‌ను బ్రేక్ చేశారు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.
వెస్ట్‌జోన్ పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో సెక్స్‌రాకెట్ గుట్టు రట్టు.. పదిమంది విటుల అరెస్ట్..పది మంది యువతుల్ని రెస్క్యూ హోమ్‌కు తరలించారు పోలీసులు. ఈ స్పా నిర్వహాకుడు నిజామాబాద్‌కు చెందిన అక్షయ్. అని గుర్తించారు.పరారీలో వున్న అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఏరోమాటిక్ స్పా.. వెల్‌నెస్ సెంటర్. లోనికి వెళ్తే ఎవరికైనా సరే ఇట్టే ఫీల్ గుడ్ అట్మాసిఫియర్ కన్పిస్తుంది. కానీ ఇక్కడ జరిగే అసలు కతమరో లెవల్. మసాజ్ ముసుగులో వ్యభిచారం. అదీ పంజాగుట్ట పీఎస్‌కు కూత వేటు దూరంలో ఇంత తంతు జరుగుతోంది. ఏ అండతో ఏరోమాటిక స్పా బరితెగింపు? పది మందివిటులు అడ్డంగా బుక్కయ్యారు. పట్టుబడిన యువతుల్ని రెస్క్యూ హోమ్‌కు తరలించారు పోలీసులు. ఇక చిక్కాల్సింది నిర్వాహాకుడు అక్షయ్. స్పా..వెల్‌నెస్ సెంటర్ల ముసుగులో సిటీలో ఇట్టాంటి డర్టీ కల్చర్ ఎక్కడెక్కడ కొనసాగుతోంది. వైడ్ యాంగిల్‌లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇంకెన్ని బ్లూ ట్రూత్స్ వెలుగులోకి వస్తాయన్నది చర్చగా మారిందిప్పుడు.
పంజాగుట్ట సెంటర్లో ఏరోమాటిక్ స్పాలో..
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా ముస్కులో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహం పై టాస్క్ ఫోర్స్ పోలీస్ లు దాడులు నిర్వహించారు. అరోమాటిక్ బ్యూటీ అండ్ వెల్నెస్ పేరుతో ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దాడి సమయంలో10 మంది అమ్మాయిలతో పాటు పదిమంది విటులను అదుపులోకి తీసుకున్నరు. ప్రధాన నిందితుడు నిజామాబాద్ చెందిన ఆకాష్ పరారీ లో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
పట్టుబడినవారిని..
గతంలో ఈ స్పా సెంటర్ పై దాడి చేసినప్పుడు విటులు దొరక్కపోవటంతో వదిలేశారు. ఈ సారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో స్పానిసి సీజ్ చేసి విటులను మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జైలుకు తరలించగా బాధిత యువతులను హోమ్ కి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం