Hyderabad Water Supply: ఏప్రిల్ 1న నగరంలో ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం.. పూర్తి వివరాలు

వాటర్‌ బోర్డ్‌ సరఫరా చేసే నీరు, ఇళ్లలోని బోర్లతో ఇన్నాళ్లు దప్పిక తీర్చుకుంటున్న గ్రేటర్‌ వాసులకు వేసవిలో తాగునీటి కష్టాలు పెరిగే అవకాశం ఉంది. భూగర్భజలాలు అడుగంటడంతో

Hyderabad Water Supply: ఏప్రిల్ 1న నగరంలో ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం.. పూర్తి వివరాలు
Water Supply
Follow us

|

Updated on: Mar 29, 2021 | 4:11 PM

వాటర్‌ బోర్డ్‌ సరఫరా చేసే నీరు, ఇళ్లలోని బోర్లతో ఇన్నాళ్లు దప్పిక తీర్చుకుంటున్న గ్రేటర్‌ వాసులకు వేసవిలో తాగునీటి కష్టాలు పెరిగే అవకాశం ఉంది. భూగర్భజలాలు అడుగంటడంతో ఇళ్లలోని బోర్లతో ఇప్పుడు పనవ్వడం లేదు. దీంతో వాటర్‌బోర్డ్‌ సరఫరా చేసే నీటిపైనే కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఆధారపడుతున్నారు. సుమారు కోటి జనాభా ఉన్న మహానగరానికి వాటర్‌ బోర్డ్‌ సరఫరా చేసే నీరు సరిపోక.. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు. నగరంలోని పలు బస్తీలు, కాలనీలలో ఇప్పటికే నీటి సమస్య ప్రారంభమైంది. ఎగువ ప్రాంతాలకు నీటి సరఫరా చాలా కష్టం అవుతుంది. పలు కాలనీలు, బస్తీ వాసుల గొంతులను వాటర్‌ ట్యాంకర్లే తడుపుతున్నాయి.

కాగా హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-1, 1200 ఎంఎం డ‌యా మెయిన్ పైప్ లైన్ జంక్ష‌న్ ప‌నులు, చంద్రాయ‌ణ గుట్ట నుంచి కందిక‌ల్ గేట్ క్రాస్ రోడ్ వ‌ర‌కు పైపులైన్ విస్త‌ర‌ణ ప‌నులు చేప‌డుతున్నారు అధికారులు.  ఈ వర్క్స్ కారణంగా  01.04.2021, గురువారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేది: 02.04.2021, శుక్ర‌వారం ఉదయం 6 గంటల వరకు.. అంటే 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి.  కాబట్టి ఈ 24 గంటలు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం.1 ప‌రిధిలోని మిరాలం రిజ‌ర్వాయ‌ర్, కిష‌న్ బాగ్ ప్రాంతం, ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 2 ప‌రిధిలోని అల్జుబైల్ కాల‌నీ, అలియాబాద్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతం, బాలాపూర్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలలో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.  కాబ‌ట్టి ఈ ప్రాంతాల్లోని వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు.

Also READ: కిరాతకం.. రూ.720 గురించి మనిషిని దారుణంగా చంపారు.. నిందితులు ముగ్గురు విద్యాధికులు

నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నోముల భగత్‌.. పార్టీ బీఫామ్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌