AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Murder: కిరాతకం.. రూ.720 గురించి మనిషిని దారుణంగా చంపారు.. నిందితులు ముగ్గురు విద్యాధికులు

మనుషుల్లో నేరప్రవృత్తి రోజురోజుకు పెరిగిపోతుంది. చిన్న, చిన్న విషయాలకే ప్రాణాలు తీసే స్థాయికి దిగజారుతున్నారు కొందరు. తాజాగా హైదరాబాద్‌లో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. 

Hyderabad Murder: కిరాతకం.. రూ.720 గురించి మనిషిని దారుణంగా చంపారు.. నిందితులు ముగ్గురు విద్యాధికులు
Murder
Ram Naramaneni
|

Updated on: Mar 29, 2021 | 3:24 PM

Share

మనుషుల్లో నేరప్రవృత్తి రోజురోజుకు పెరిగిపోతుంది. చిన్న, చిన్న విషయాలకే ప్రాణాలు తీసే స్థాయికి దిగజారుతున్నారు కొందరు. తాజాగా హైదరాబాద్‌లో అటువంటి ఘటనే చోటుచేసుకుంది.  కేవలం 720రూపాయలకు గురించిన వివాదానికే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు ముగ్గురు యువకులు. హయత్ నగర్ లోని డిపో సమీపంలో పండ్ల వ్యాపారి మధుసూదన్ రెడ్డిని దారుణంగా హతమార్చారు. బండ రాయితో మోది అతికిరాతకంగా హత్యచేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. ముగ్గురు యువకులే హత్య చేసినట్టు గుర్తించారు. మద్యం కొనుగోలుకుగాను 720రూపాయల వివాదమే హత్యకు కారణంగా నిర్ధారించారు. నిందితులు సందీప్ రెడ్డి, ఉదయ్ కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ లను అదుపులోకి తీసుకున్నారు. ఓ బెల్ట్ షాప్ వద్ద ఈ ముగ్గురు యువకులు… గూగుల్ పే పని చేయడంలేదంటూ సుభాష్‌ అనే పండ్ల వ్యాపారి వద్ద 720 రూపాయలు తీసుకున్నారు.

తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో సందీప్‌కు చెందిన బైక్‌, సెల్ ఫోన్‌ను సుభాష్‌ తీసుకెళ్లాడు. వాటిని తన వద్ద వర్క్ చేసే ఆనంద్, మదుసూధన్‌రెడ్డి, నర్సింహలకు అప్పగించి సుభాష్‌ ఇంటికి వెళ్లాడు. ఆ వ్యక్తులు వస్తే డబ్బులు తీసుకుని.. వాటిని ఇచ్చేయమని సూచించాడు. కొద్ది సేపటికి నిందితులు పండ్ల బండి వద్దకు వచ్చి వారితో గొడవకుదిగారు. కర్రలతో దాడిచేయబోతే మధుసూదన్‌ రెడ్డి, నర్సింహ, ఆనంద్ అక్కడ్నుంచి ప్రాణభయంతో‌ పరుగులు తీశారు. మధుసూదన్‌ రెడ్డి వారికి చిక్కడంతో కర్రలు, రాయితో అతడిపై దాడి చేశారు. దీంతో మధుసూదన్‌ రెడ్డి స్పాట్‌లోనే మృతి చెందాడు. నర్సింహ కంప్లైంట్ మేరకు హయత్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు ముగ్గురు ఉన్నత చదువులు చదివినవారే అవ్వడం గమనార్హం.

Also READ:ప్రపంచంలోనే ఈ బీచ్ వెరీ స్పెషల్.. రోజుకు రెండు గంటలు మాయం.. అప్పుడు ముత్యాలు లభ్యం ఎక్కడంటే..!

రాత్రి మిగిలిపోయిన అన్నం తింటున్నారా ? ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా అనేది తెలుసుకుందామా..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్